సాగర్ కాల్వలో చిల్లచెట్ల తొలగింపు
ABN , Publish Date - Apr 30 , 2025 | 10:38 PM
పుల్లలచెరువు, త్రిపురాంతకం మండలాలల్లో సాగర్ కాల్వకు ఇరువైపులా చ్లెచెట్లు, కంప తొలగింపు పనులను బుధవారం టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు ప్రారంభించారు. కొబ్బరి కాయ కొట్టి ఎక్స్‌కవేటర్‌తో పనులు మొద లు పెట్టారు.
ఎర్రగొండపాలెం, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి) : పుల్లలచెరువు, త్రిపురాంతకం మండలాలల్లో సాగర్ కాల్వకు ఇరువైపులా చ్లెచెట్లు, కంప తొలగింపు పనులను బుధవారం టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు ప్రారంభించారు. కొబ్బరి కాయ కొట్టి ఎక్స్‌కవేటర్‌తో పనులు మొద లు పెట్టారు. ఈ సందర్భంగా ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ పాలనలో కాలువల అభివృద్ధిని విస్మరించారని ధ్వజమెత్తారు. కాల్వకు ఇరువైపులా చిల్లచెట్లు ఏపుగా పెరగడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయినా నిమ్మకునీరెత్తిన ట్లు వ్యవహరించారన్నారు. సాగర్ కాల్వ కింద భూములు ఉన్న రైతులు సమస్యను తెలుసుకున్న ఎరిక్షన్‌బాబు దీనిపై జలవనరులశాఖ ఇంజనీర్లను సంప్రదించి చిల్లచెట్ల తొలగింపు పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఇంజనీర్లు, టీడీపీ నాయకులు, సాగునీటి సంఘం అధ్యక్షులు దేవినేని చలమయ్య, పయ్యావుల ప్ర సాద్, శనగా నారాయణరెడ్డి, సుబ్బారెడ్డి, మేడికొండ లక్ష్మినారాయణ, మేకల వలరాజు, పొట్లగోవింద్ పాల్గొన్నారు.