కళాశాల పాత భవనాల తొలగింపు
ABN , Publish Date - Oct 14 , 2025 | 12:51 AM
అద్దంకి పట్టణంలో పాత భవనాలలో ఒకటిగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో శిధిలావస్థకు చేరిన భవనాలను తొలగిస్తున్నారు.
అద్దంకి, అక్టోబరు13 (ఆంధ్రజ్యోతి): అద్దంకి పట్టణంలో పాత భవనాలలో ఒకటిగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో శిధిలావస్థకు చేరిన భవనాలను తొలగిస్తున్నారు. పట్టణంలో 1960లో ప్రభుత్వ హైస్కూల్‌లో అదనపు గదులను నిర్మించారు. అనంతరం 1966లో ఎస్‌ఎస్‌ఎల్‌సీ ఎగ్జామ్ సెంటర్‌ను ఇదే భవనంలో నిర్వహించారు. ఈ భవనాన్ని 1974 నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వినియోగించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కొత్త భవనాలు నిర్మించడంతో కొంత కాలం పాటు ఖాళీగా ఉంది. అనంతరం గొట్టిపాటి రవికుమార్ అద్దంకి ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలినాళ్లలో అద్దంకికి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేయించడంతో ఖాళీ గా ఉన్న భవనాలను వినియోగించుకున్నారు. దశాబ్ద కాలం క్రితం శింగరకొండ సమీపంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు భవనాలు నిర్మించారు. అప్పటి నుండి పాత భవనాలు ఖాళీగా ఉన్నాయి. అదే సమయంలో పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరింది. అదే ప్రాంతం లో అద్దంకి పట్టణ సమగ్ర మంచినీటి పథకం లో భాగంగా ఓవర్ హెడ్ ట్యాంక్‌ను నిర్మిస్తున్నారు. దీంతో పలువురు ఇటీవల మం త్రి రవికుమార్‌ను కలిసి పాత భవనాలను తొలగించాలని కోరారు. దీంతో రెండు రోజులుగా పాతభవనాల తొలగింపు చేపడుతున్నారు. దీంతో ప్రకాశం ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రకాశం ప్రభుత్వ బాలు ర ఉన్నత పాఠశాలకు అదనపు ఖాళీ స్థలం ఏర్పడనుంది. అయితే అద్దంకి పట్టణం నడిబొడ్డున ఉండటంతో వాకింగ్ ట్రాక్‌గా అభి వృద్ది చేస్తే మరింత ఉపయోగకరంగా ఉం టుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.