Share News

ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు తొలగింపు

ABN , Publish Date - May 31 , 2025 | 10:35 PM

దర్శి పట్ట ణంలోని అద్దంకి రోడ్డులోని ప్రభుత్వ స్థలం లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను రెవె న్యూ అధికారులు తొలగించారు. ప్రభుత్వ స్థలాల అక్రమణలపై చర్యలేవీ! శీర్షికన శనివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన క థనానికి అధికారులు స్పందించారు.

ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు తొలగింపు
దర్శి -అద్దంకి రోడ్డులో తొలగిస్తున్న ప్రభుత్వ స్థలంలోని నిర్మాణం

దర్శి, మే 31(ఆంధ్రజ్యోతి): దర్శి పట్ట ణంలోని అద్దంకి రోడ్డులోని ప్రభుత్వ స్థలం లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను రెవె న్యూ అధికారులు తొలగించారు. ప్రభుత్వ స్థలాల అక్రమణలపై చర్యలేవీ! శీర్షికన శనివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన క థనానికి అధికారులు స్పందించారు. దర్శి- అద్దంకి రోడ్డులోని 340/5 సర్వే నెంబర్‌లో గల ప్రభుత్వభూమిని కొంతమంది ఆక్ర మించి కట్టడాలు నిర్మించారు. ఉన్నతాధి కారుల ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ పరిటాల శ్రీనివాసరావు సిబ్బందితో వెళ్లి అక్కడ నిర్మించిన టాయి లెట్‌ను తొలగించారు. మిగిలిన స్థలంలోని నాపరాళ్లను తొలగించారు.

బండిదారి ఆక్రమణ గురించి పట్టించుకోని అధికారులు

దర్శి-అద్దంకి రోడ్డులో ప్రభుత్వ స్థలంలో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించిన అధికారులు కురిచేడు రోడ్డులోని బండిదారి ఆక్రమణల గురించి పట్టించుకో లేదు. ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంలో దర్శి పట్టణంలో ఆక్రమణలకు గురైన అనేక స్థలాల గురించి వివరించగా, ఒకచోట మాత్రమే అధికారులు చర్యలు తీసుకొని మిగిలినవాటి గురించి పట్టించుకోలేదు. దర్శి- కురిచేడు రోడ్డులోని బండిదారి భూమిలో సుమారు ఐదు ఎకరాలు ఆక్రమించిన విషయం తెలిసిందే. గతం లో బండి స్థలం ఆక్రమణ తొలగింపునకు మార్కింగ్‌ కూడా ఇచ్చారు ఆతర్వాత ఏకారణం చేతనో వది లేశారు. దర్శి రెవెన్యూలోని 244, 247, 248, 266 సర్వే నెంబర్లల్లో సుమారు పది ఎకరాల బం డిదారి భూమి ఉన్న విషయం తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికశాతం భూమి ని ఆక్రమించి గృహాలు నిర్మించారు. మరికొందరు గొడౌన్‌లు కట్టుకున్నారు. నాటి పాలకులు ఆక్ర మణల గురించి పట్టించుకోలేదు. కూటమి ప్ర భుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమా ర్కుల భరతం పడతారని అందరూ భావించారు. అ యితే, అధికారులు పూర్తిస్థాయిలో స్పందించటంలేదు, పత్రికల్లో కథనాలు వచ్చినప్పుడు మాత్రమే తాత్కాలిక చర్యలు చేపట్టి ఆతర్వాత వదిలేస్తున్నారు. దీంతో ఆక్ర మణదారులకు భయం లేకుండాపోయింది. ఇప్పటికైన అధికారులు స్పందించి దర్శిలోని ఆనేక ప్రాంతాల్లో ఆక్ర మణలకు గురైన ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకో వాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - May 31 , 2025 | 10:35 PM