చీమకుర్తిలో ఆక్రమణల తొలగింపు ప్రారంభం
ABN , Publish Date - Jun 11 , 2025 | 12:08 AM
చీమకుర్తి పట్టణంలో ఆక్రమణలు తొలగింపు కార్యక్రమా న్ని మున్సిపల్ అధికారులు మంగళవారం ప్రా రంభించారు. పట్టణంలోని నయాగారా హోటల్ నుంచి ఇసుకవాగు సెంటర్ వరకూ ఆక్రమణల పర్వం చోటుచేసుకోవటంతో రహదారి కుచించు కుపోయి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఒంగోలు నుంచి కర్నూల్‌కి వెళ్లే రహ దారికి ఇరువైపులా ఈ ఆక్రమణలు పెరిగిపోవ డంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి.

పరిశీలించిన మున్సిపల్ సిబ్బంది
చీమకుర్తి, జూన్10(ఆంధ్రజ్యోతి) : చీమకుర్తి పట్టణంలో ఆక్రమణలు తొలగింపు కార్యక్రమా న్ని మున్సిపల్ అధికారులు మంగళవారం ప్రా రంభించారు. పట్టణంలోని నయాగారా హోటల్ నుంచి ఇసుకవాగు సెంటర్ వరకూ ఆక్రమణల పర్వం చోటుచేసుకోవటంతో రహదారి కుచించు కుపోయి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఒంగోలు నుంచి కర్నూల్‌కి వెళ్లే రహ దారికి ఇరువైపులా ఈ ఆక్రమణలు పెరిగిపోవ డంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీనికితోడు తోడు రోడుకు ఇరువైపులా భారీస్థా యిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండటంతో సమస్య మరింత జఠిలంగా మారుతోంది. దీంతో ము న్సిపల్ అధికారులు ఆక్రమణలు తొలగించాలనే నిర్ణయానికి వచ్చారు. పట్టణం సుందరీకరణలో భాగంగా కూడా ఆక్రమణలు తొలగింపు తోడ్పడ నుంది. రహదారికి డివైడర్లు నిర్మించి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తే గెలాక్సీపురం ధగధగలాడిపోతుందని, పట్టణ రూపురేఖలు మారిపోతాయని మున్సిపల్ అధికారులు భావి స్తున్నారు. అందుకోసమే ఆక్రమణలు తొలగింపు ను చేపట్టారు. కాగా గతంలో కూడా ఇలాగే ఆ క్రమణలును తొలగించారు. కానీ ఎటువటి సుం దరీకరణ చర్యలు చేపట్టలేదు. దీంతో తిరిగి ఆక్రమణలు చోటుచేసుకున్నాయి. ఈసారైనా మ ళ్లీ ఆక్రమణలు జరగకుండా మున్సిపల్ అధికా రులు పటిష్ట చర్యలు తీసుకోవాలని పట్టణవా సులు కోరుతున్నారు.