శానిటరీ ఇన్‌స్పెక్టర్ విధుల నుంచి తొలగింపు
ABN , Publish Date - Dec 20 , 2025 | 12:32 AM
ఒంగోలు నగరపాలక సంస్థ శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న శానిటరీ ఇన్‌స్పెక్టర్ కంకణాల ఆంజ నేయులను బాధ్యతల నుంచి తొలగిస్తూ కార్పొరేషన్ కమిషనర్ కె.వెంకటేశ్వర రావు శుక్రవారం ఉత్వర్వులు జారీ చేశారు.
కమిషనర్ ఉత్తర్వులు
ఒంగోలు కార్పొరేషన్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఒంగోలు నగరపాలక సంస్థ శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న శానిటరీ ఇన్‌స్పెక్టర్ కంకణాల ఆంజ నేయులను బాధ్యతల నుంచి తొలగిస్తూ కార్పొరేషన్ కమిషనర్ కె.వెంకటేశ్వర రావు శుక్రవారం ఉత్వర్వులు జారీ చేశారు. శానిటేషన్ విభాగంలో విధుల్లో ని ర్లక్ష్యంగా వ్యవహరించడం, కార్మికులను కక్షసాధింపు, వేధింపులకు పాల్పడటం, పలువురు వ్యాపారుల నుంచి చెత్తపన్ను పేరుతో అనధికారంగా డబ్బులు వసూ లు చేయడాన్ని ఆంధ్రజ్యోతిలో ‘పారిశుధ్యంలో అవినీతి కంపు’ కథనం ప్రచురిం చింది. అలాగే ఆయన తీరుపై పలువురు కార్మికులు ఇటీవల కార్పొరేషన్ కార్యా లయంలో నిరసన తెలిపారు. దీంతో కమిషనర్ విచారణ చేపట్టిన అనంతరం ఆంజనేయులును విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.