Share News

రోడ్ల అభివృద్ధికి నిధులు విడుదల చేయండి

ABN , Publish Date - Nov 06 , 2025 | 10:21 PM

మొంథా తుఫాన్‌తో దర్శి నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, కాలువల పునర్నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని సీఎం చంద్రబాబుకు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి విజ్ఞప్తి చేశారు.

రోడ్ల అభివృద్ధికి నిధులు విడుదల చేయండి

సీఎం చంద్రబాబును కలిసి సమస్యలను వివరిస్తున్న డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి

సీఎం చంద్రబాబును కోరిన టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి

దర్శి, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్‌తో దర్శి నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, కాలువల పునర్నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని సీఎం చంద్రబాబుకు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి విజ్ఞప్తి చేశారు. గురువారం అమరావతిలో సీఎం చంద్రబాబును కలిసి నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు విడుదల చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. దొనకొండను పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు ఇప్పటికే ప్రతిష్టాత్మకమైన రక్షణరంగ సంస్థ, క్యాన్సర్‌ రీసర్చ్‌ సెంటర్‌, సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు పరిశ్రమల ఏర్పాటుచేయిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే, దర్శి నియోజకవర్గంలో నిలచిన పలు అభివృద్ధి కార్యక్రమాల పునర్మిర్మాణానికి నిధులు విడుదల చేసినందుకు కృతజ్ఙతలు తెలిపారు. మిగిలిన ప్రాజెక్టులైన జాతీయ డ్రైవింగ్‌ శిక్షణా కేంద్రం, కోల్డ్‌ స్టోరేజీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు భనన నిర్మాణాలు, తదితర ప్రాజెక్టులకు నిధుల విడుదల చేయాలని కోరగా సీఎం సానుకూలంగా స్పందించి భరోసా ఇచ్చినట్లు డాక్టర్‌ లక్ష్మి తెలిపారు.

Updated Date - Nov 06 , 2025 | 10:21 PM