వైసీపీ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టండి
ABN , Publish Date - Jul 02 , 2025 | 11:51 PM
వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను టీడీపీ శ్రేణులు తిప్పికొట్టాలని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు.
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో
ఎమ్మెల్యే నారాయణరెడ్డి పిలుపు
తర్లుపాడు, జూలై 2 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను టీడీపీ శ్రేణులు తిప్పికొట్టాలని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా తర్లుపాడులో ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత వైసీపీ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందన్నారు. సీఎం చంద్రబాబు తొలి ఏడాదిలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఇంట్లో ఉన్న పిల్లలందరికీ తల్లికి వందనం పథకాన్ని అమలు చేశారన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు, పింఛన్‌ల పెంపు, యువతకు ఉద్యోగాల నియామకాలకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నట్లు చెప్పారు. రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ.20వేలు అందిస్తుందన్నారు. జగన్‌రెడ్డి పనులు పూర్తి చేయకుండానే వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం సిగ్గుచేటన్నారు. త్వరలో మార్కాపురం జిల్లా అవుతుందన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు యు.చిన్నపురెడ్డి, కంచెర్ల కాశయ్య, మండల యూత్ అధ్యక్షుడు మేకల వెంకట్, పి.గోపినాథ్ చౌదరి, లక్ష్మయ్య, జి.సుబ్బయ్య, జి.నరసింహులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌చార్జిలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మార్కాపురం రూరల్ : ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ఎమ్మెల్యే కందుల అన్నారు. మండలంలోని దరిమడుగు గ్రామంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
పొదిలి : అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని 1వ వార్డులో సుపరిపానకు తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో అన్నిర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజా ప్రభుత్వ పాలన సాగుతోందన్నారు. వైసీపీ పాలకులు ఇచ్చిన ప్రతి హామీని విస్మరించిన విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రాన్ని నాశనం చేసిన గత పాలకులు ప్రజా ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తుండడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం
ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
గిద్దలూరు టౌన్ : ప్రజలకు సుపరిపాలన అందించడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని, ఆదిశగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం పట్టణంలోని 2, 9 వార్డులలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ఇంటింటికీ వెళ్లి ఏడాది పాలనపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటూ ఇప్పటివరకు ప్రభుత్వం అమలు చేసిన పథకాలను వివరించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించామని, సూపర్ 6 పథకాలపై అభిప్రాయాలు తెలుసుకోవడంతోపాటు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాలు అందని వారిని గుర్తించి వారికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు. వైసీపీ పాలకులవి మాటలు బారెడు, చేతలు జానెడు అని విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని గత పాలకులు ప్రజా ప్రభుత్వంపై బురద చల్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మఒడిని ఎంతమందికి ఇచ్చారో జగన్‌రెడ్డి చెప్పాలని అశోక్‌రెడ్డి ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్, సీపీఎస్ రద్దు ఏమయ్యాయన్నారు. ప్రజా ప్రభుత్వం నిరుద్యోగుల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిందని, అన్న క్యాంటీన్లు, ఉచిత సిలిండర్లు, తల్లికివందనం హామీలను అమలు చేశామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాముల వెంకటసుబ్బయ్య, పట్టణ పార్టీ అధ్యక్షుడు షానేషావలి, జడ్పీటీసీ సభ్యుడు బుడత మధుసూదన్, సొసైటీ బ్యాంక్ చైర్మన్ దుత్తా బాలీశ్వరయ్య, కౌన్సిలర్ చంద్రశేఖర్‌యాదవ్ పాల్గొన్నారు.
కొమరోలు : ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అన్ని హామీలను నిలబెట్టుకున్నామని టీడీపీ మండల అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపీటీసీ మాజీ సభ్యుడు ముత్తుముల సంజీవరెడ్డి మాట్లాడుతూ సూపర్‌సిక్స్ పథకాల అమలుకు చంద్రబాబు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ ఉపాధ్యక్షుడు గోడి ఓబుల్‌రెడ్డి, పార్టీ ఉపాధ్యక్షుడు తిరుమలరెడ్డి, నాయకులు చలిచీమల శ్రీనివాసచౌదరి, సుభాని, బాషా పాల్గొన్నారు.
వసతులు కల్పిస్తాం : ఎరిక్షన్‌బాబు
పుల్లలచెరువు : సుపరిపాలనతో గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేయడమే ప్రభుత్వం లక్ష్యం అని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. బుధవారం పుల్లలచెరువులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ ప్రతి గ్రామాన్నీ ఆదర్శవంతంగా తీర్చీదిద్దేందుకు రూ.15కోట్లతో సీసీ రోడ్డు పనులు చేపట్టామన్నారు. సూపర్‌సిక్స్ పథకాల్లో ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. పేదల సంక్షేమానికి ప్రజా ప్రభు త్వం కట్టుబడి ఉందన్నారు. పింఛన్‌లు, ఏడాదికి మూడు ఉచిత సిలిం డర్లు, తల్లికివందనం, అన్నదాత సుఖీభవ, ఆగస్టులో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. అనంతరం స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకున్న ఎరిక్షన్‌బాబు పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు నాదెండ్ల బ్రహ్మం చౌదరి, టీడీపీ మండలాధ్యక్షుడు పయ్యావుల ప్రసాద్, నాయకులు కాకర్ల కోటయ్య, రెంటపల్లి సుబ్బారెడ్డి, శనగ నారాయణరెడ్డి, కొలుకులూరి కుమార్,మేడికొండ లక్ష్మినారాయణ, భాస్కర్, రాధకృష్ణ, ఎంపీపీ వెంకటయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.
పెద్ద దోర్నాల : ఏడాది పాలనలో ఇచ్చిన సూపర్‌సిక్స్ హామీలను నెరవేరుస్తున్న మన మంచి ప్రభుత్వం అని ఒంగోలు టీఎన్‌టీయూసి ప్రధాన కార్యదర్శి ఈదర మల్లయ్య పేర్కొన్నారు. మండలంలోని కడపరాజుపల్లె గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో నెరవేర్చిన హామీలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెమ్మసాని మల్లయ్య, నాగరాజు, శ్రీను, సుబ్బారెడ్డి, వెంకటేశ్వర్లు, మధుబాబు, తదితరులు పాల్గొన్నారు.
ఎర్రగొండపాలెం : సూపర్‌సిక్స్ హామీలను ఏడాదిలోనే అమలు చేసి ప్రజా ప్రభుత్వం అనిపించుకుందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని స్థానిక చైతన్యనగర్‌లో బుధవారం ఏఎంసీ చైర్మన్ చేకూరి సుబ్బారావు, టీడీపీ ప్రజా ప్రతినిధులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికీ వెళ్లి ప్రజా ప్రభుత్వ ఏడాది పాలనపై కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌చార్జి షేక్ మస్తాన్ వలి, పట్టణ అధ్యక్షుడు పెరుమాళ్ల మల్లికార్జునరావు, మాజీ సర్పంచి కంచర్ల సత్యనారాయణగౌడ్, టీడీపీ నాయకులు చిట్యాల వెంగళరెడ్డి, కొత్త మాసు సుబ్రహ్మణ్యం, గోళ్ల సుబ్బారావు, మంత్రునాయక్, తోట మహేష్, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.