పొగాకు నారుమళ్లకు రిజిస్ర్టేషన్ తప్పనిసరి
ABN , Publish Date - Aug 28 , 2025 | 10:53 PM
పొగాకు నారుమళ్లకు రి జిస్ర్టేషన్‌లు తప్పనిసరి అని రీజినల్ సూపరింటెండెంట్ ఎం. సత్యశ్రీనివాస్ అన్నారు. గురువారం మండలంలోని మాదాలవారిపాలెం, మూగచింతలపాలెంలో నారుమడులు సాగు చేస్తున్న యజమానులకు తగుసూచనలు చేశారు.
పొదిలి, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి) : పొగాకు నారుమళ్లకు రి జిస్ర్టేషన్‌లు తప్పనిసరి అని రీజినల్ సూపరింటెండెంట్ ఎం. సత్యశ్రీనివాస్ అన్నారు. గురువారం మండలంలోని మాదాలవారిపాలెం, మూగచింతలపాలెంలో నారుమడులు సాగు చేస్తున్న యజమానులకు తగుసూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంచి విత్తనాలను ఎంపిక చేసుకుని తప్పనిసరిగా బోర్డు అనుమతితో పొగాకు సాగు చేయాలన్నారు. పొగాకు దేశీయంగా విదేశాల్లో మంచి గిరాకీ ఉందన్నారు. అయితే మార్కెట్లో ప్రస్తుతం ఉన్న విలువను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత పంట కాలానికి 142 మిలియన్ కిలోల ఉత్పత్తిని అనుమతించారని తెలిపారు. ఈ ఏడాది రైతు లు పొగాకు బోర్డు నిర్ణయించిన పరిమితిలోనే సాగుచేయాలన్నారు. పొగాకు పంట నియంత్రణలో భాగంగా నారుమళ్ల దశ నుంచే రైతులకు అవగాహన కల్పించాలన్నారు. గరిష్టంగా ప్రతి రైతు రెండు హెక్టార్ల విస్తీర్ణం వరకు రిజిస్ర్టేషన్ చేయించుకోవచ్చన్నారు. రిజిస్ర్టేషన్ చేయించుకున్న రైతులకు మాత్రమే ఎంఐఆర్‌సీఏ సంస్థ వారు విత్తనాలను సరఫరా చేస్తారన్నారు. నవంబరు 30లోపు నారు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో రీజనల్ క్షేత్ర సహాయకు లు మోతీలాల్, పొదిలి వేలం నిర్వహణాధికారి గిరిరాజ్‌కుమార్, క్షేత్ర సహాయకులు జీవన్, కే.ఆశాబీ, రైతులు పాల్గొన్నారు.