డీఎస్సీ సర్టిఫికెట్ల పునఃపరిశీలన
ABN , Publish Date - Sep 04 , 2025 | 01:15 AM
మెగా డీఎస్సీ అభ్యర్థుల ఎంపికలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహిం చేందుకు పాఠశాల విద్యాశాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. అపోహలకు తావు లేకుండా అభ్యర్థులు సమర్పించిన ధ్రువపత్రాలను మరోసారి పరిశీలించాలని పాఠశాల విద్య డైరెక్టర్ ఆదేశించారు.
పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు
ఒంగోలు విద్య, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : మెగా డీఎస్సీ అభ్యర్థుల ఎంపికలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహిం చేందుకు పాఠశాల విద్యాశాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. అపోహలకు తావు లేకుండా అభ్యర్థులు సమర్పించిన ధ్రువపత్రాలను మరోసారి పరిశీలించాలని పాఠశాల విద్య డైరెక్టర్ ఆదేశించారు. దీంతో ఆ ప్రక్రియను డీఈవో కిరణ్‌కుమార్ బుధవారం స్థానిక సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు కార్యా లయంలో ప్రారంభించారు. మొదటి, రెండో విడత సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన అధికారులను పిలిపించి మళ్లీ వారితోనే మరోసారి వెరిఫై చేయిస్తున్నారు. మొదటి విడతలో 657మంది అభ్యర్థులకు 652మంది సర్టిఫికెట్లను పరిశీలించారు. మిగిలిన ఐదుగురిలో ముగ్గురు ఈ పోస్టులకు వచ్చేందుకు తిరస్కరించారు. మరో ఇద్దరికి సకాలంలో బీఈడీ సర్టిఫికెట్లు అందకపోవడంతో వారిని అనర్హులుగా ప్రకటించారు. రెండో విడత 19మంది పరిశీలనకు హాజరయ్యారు. కాగా పత్రాలలో ఎటువంటి తప్పులు లేవని ఈ బృందాలు మరోసారి పరిశీలించి ధ్రువీకరించాల్సి ఉంది. ఆన్‌లైన్‌లోని అభ్యర్థుల సర్టిఫికెట్లు, వారు సమర్పించిన వాటి నకళ్లను పరిశీలిస్తున్నారు. ఇదే సమయంలో మంగళ గిరిలోని పాఠశాల విద్య డైరెక్టర్ కార్యాలయంలో అభ్యర్థుల తుది ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది.