Share News

ఒంగోలులో ఇంటి పట్టాల పునఃపరిశీలన

ABN , Publish Date - May 22 , 2025 | 12:52 AM

ఒంగోలు నగరంలో ఇంటి పట్టాలకు సంబంధిం చి పునఃపరిశీలన కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోపాల కృష్ణ స్థానిక రామ్‌నగర్‌, అన్నవరప్పాడులో గ తంలో ఇంటి పట్టాలు పొందిన లబ్ధిదారుల గృ హాలను సందర్శించి ఆయా పట్టాలను పరిశీలిం చారు.

ఒంగోలులో ఇంటి పట్టాల పునఃపరిశీలన

తనిఖీ చేసిన జేసీ గోపాలకృష్ణ

ఒంగోలు కలెక్టరేట్‌, మే 21 (ఆంధ్రజ్యోతి): ఒంగోలు నగరంలో ఇంటి పట్టాలకు సంబంధిం చి పునఃపరిశీలన కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోపాల కృష్ణ స్థానిక రామ్‌నగర్‌, అన్నవరప్పాడులో గ తంలో ఇంటి పట్టాలు పొందిన లబ్ధిదారుల గృ హాలను సందర్శించి ఆయా పట్టాలను పరిశీలిం చారు. మధ్యాహ్నం ఆర్డీవో లక్ష్మీప్రసన్న, నగర కమిషనర్‌ వెంకటేశ్వరరావుతో కలిసి పట్టాలు పొందిన లబ్ధిదారుల నివాసాలను సందర్శించి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయంలో నగరంలో 21వేల మందికి పైగా పట్టాలు ఇవ్వగా వాటిలో సగం మందికి పైగా అనర్హులకు పట్టాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈనేపథ్యంలో గతంలో ఇంటి మీటర్ల ఆధారంగా పట్టాలను పునఃపరిశీ లన చేసిన రెవెన్యూ అధికారులు ప్రస్తుతం ప ట్టాలు పొందిన లబ్ధిదారుల గృహాలను సంద ర్శించి వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన వారికి పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అందుకు అనుగుణంగా అధి కారులు చర్యలు తీసుకున్నారు. ఒంగోలులో మి గిలిన పట్టాలు పొందిన లబ్ధిదారులను కూడా పరిశీలన చేయనున్నట్లు తెలుస్తోంది. కార్యక్ర మంలో అర్బన్‌ తహసీల్దార్‌ పిన్నిక మధుసూద న్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2025 | 12:52 AM