పార్టీ కోసం కష్టపడే వారికి గుర్తింపు
ABN , Publish Date - Aug 26 , 2025 | 10:57 PM
పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు.
టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు
ఎర్రగొండపాలెం, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి) : పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. టీడీపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన మావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. టీడీ పీ అధ్యక్షుడు ఏఎంసీ చైర్మన్ చేకూరి సుబ్బారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ మండల పార్టీ అధ్యక్ష పదవికి, మండలంలో వివిధ అనుబంధ సంఘాల కమిటీల కోసం పేర్లను ప్రతిపాదించారని వాటిని అధిష్టానానికి పంపిస్తామన్నారు. పార్టీ ఆమోదం తర్వాత పేర్లు ప్రకటిస్తామని ఎరిక్షన్‌బాబు తెలిపారు. స మావేశంలో టీడీపీ నాయకులు చిట్యాల వెంగళరెడ్డి, వేగినాటి శ్రీను, గోళ్ల సుబ్బారావు,తోట మహెష్, పట్టణ అధ్యక్షుడు పీ మల్లికార్జునరావు, కొత్తమాసు సుబ్రమణ్యం, కంచర్ల సత్యనారాయణగౌడ్, మంత్రునాయక్, సాయపునేని సుందయ్య, షేక్ మస్తాన్‌వలి, చేదూరి గంగయ్య, అచ్యుతరావు, చెవుల అంజయ్య పాల్గొన్నారు.