Share News

కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు

ABN , Publish Date - Dec 29 , 2025 | 11:41 PM

టీడీపీ అభ్యున్నతి కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తల ను పార్టీ గుర్తించి తగిన గౌరవం ఇస్తుందని ఆపార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. పార్టీ విజయం కోసం, బలోపేతం కోసం అహర్నిశలు కృషిచేసిన కార్యకర్తలకు స్థా నిక టీడీపీ కార్యాలయంలో సోమవారం సా యంత్రం ప్రతిభా అవార్డులు అందజేశారు.

కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు
దర్శిలో టీడీపీ కార్యకర్తలకు ప్రతిభా అవార్డులు అందజేస్తున్న గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్‌ లలిత్‌సాగర్‌ దంపతులు, పాల్గొన్న మున్సిపల్‌ చైర్మన్‌ పిచ్చయ్య తదితరులు

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి

దర్శి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): టీడీపీ అభ్యున్నతి కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తల ను పార్టీ గుర్తించి తగిన గౌరవం ఇస్తుందని ఆపార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. పార్టీ విజయం కోసం, బలోపేతం కోసం అహర్నిశలు కృషిచేసిన కార్యకర్తలకు స్థా నిక టీడీపీ కార్యాలయంలో సోమవారం సా యంత్రం ప్రతిభా అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీకి బలం, బలగం కార్యకర్తలేనని తెలిపారు. సీఎం చంద్ర బాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సారథ్యం లోని కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. గతంలో ఎన్నడూలేని విధం గా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. కార్య కర్తలు ఇదేస్ఫూర్తితో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి పార్టీ పట్ల ఆకర్షితుల య్యే విధంగా కృషి చేయాలన్నారు

అనంతరం దర్శి పట్టణంలోని 19వ వార్డులో, 4వ వార్డులో నిర్మించతలపెట్టిన మురుగు కాల్వలకు శంకుస్థాపన చేశారు. హ్యాపీ హోమ్స్‌లో నూతనంగా నిర్మించిన హైమాస్‌ లైట్లను ప్రారంభించారు. కార్యక్ర మంలో టీడీపీ నియోజకవర్గ నాయకుడు డాక్టర్‌ కడి యాల లలిత్‌సాగర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ నారపుశెట్టి పి చ్చయ్య, కమిషనర్‌ వై.మహేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్‌ దారం నాగవేణి, సుబ్బారావు, టీడీపీ దర్శి పట్టణ అ ధ్యక్షుడు పుల్లలచెరువు చిన్నా, దర్శి, దొనకొండ, తాళ్ళూరు, ముండ్లమూరు మండలాల పార్టీ అధ్యక్షులు మారెళ్ళ వెంకటేశ్వర్లు మోడి ఆంజనేయులు, మేడగం వెంకటేశ్వరరెడ్డి, కూరపాటి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్తలే పార్టీకి వెన్నుదన్ను

కురిచేడు, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నుదన్ను అని టీడీపీ నియోజ కవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. మం డలంలో పార్టీకి అండగా నిలిచి అన్ని విషయాలలో ముందున్న కార్యకర్తలకు సోమవారం ఆమె ప్రశంసా పత్రాలు అందజేశారు. కురిచేడుకు చెందిన మాచవ రపు నాగేంద్ర, కల్లూరుకు చెందిర నక్కా ప్రభాకర రావు, ఏరువ రామయ్య, అలవలపాడుకు చెందిన రావి అంజలి, పడమర వీరాయపాలెంకు చెందిన గణపర్తి సుబ్బారావు, గణపర్తి వెంకటేశ్వర్లు, ఆవులమందకు చెందిన ఉన్నగిరి నాగేశ్వరరావు, దేక నకొండకు చెందిన బెల్లం సత్యనారా యణ, నమశ్శివాయపురంకు చెందిన కేసనపల్లి సువయ్యలకు మెమెంటో, ప్రశంసాపత్రాన్ని అందించారు. సుప రిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం లో భాగంగా పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని సేవలు అందిం చిన కార్యకర్తలను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు అభినందిస్తూ ఈ ప్రశంసాపత్రాలు పంపినట్లు లక్ష్మి పేర్కొన్నారు.

ఉత్తమ కార్యకర్తలుగా పలువురు ఎంపిక

ముండ్లమూరు, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలువురు టీడీపీ కార్యకర్తలు సోమ వారం ఆపార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి చేతులమీదుగా ఉత్తమ కార్యకర్తలుగా అవార్డులు అందుకున్నారు. శంకరాపురం గ్రామానికి చెందిన మం దలపు అజయ్‌, నాయుడుపాలెంకు చెందిన గిరిబాబు, నూజెండ్లపల్లికి చెందిన కిలారి ఆంజనేయులు, ఉమా మహేశ్వర అగ్రహారంకు చెందిన గంగినేని రామాంజ నేయులు, నల్లబోతుల శ్రీనివాసులు, పసుపుగల్లుకు చెందిన రాగినూతన ఆరోను, పులిపాడుకు చెందిన మద్దిపూడి అంకమరావు, ముండ్లమూరుకు చెందిన ఆవులూరి సుబ్బయ్య, మారెళ్ళకు చెందిన తొట్టెంపూడి చినఏడుకొండలు తదితరులు డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్‌ లలిత్‌సాగర్‌ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు.

Updated Date - Dec 29 , 2025 | 11:41 PM