Share News

‘తల్లికి వందనం’తో కుటుంబానికి భరోసా

ABN , Publish Date - Jul 03 , 2025 | 11:40 PM

తల్లికి వందనం కుటుంబానికి భరోసా అని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే నివాసంలోని కుట్టు శిక్షణలో ఉన్న మహిళలతో కలిసి తల్లికి వందనం పథకం విజయవంతంగా తల్లులకు చేరిన సందర్భంగా గురువారం సంబరాలు చేసుకున్నారు.

‘తల్లికి వందనం’తో కుటుంబానికి భరోసా
కేకును కట్‌ చేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

కనిగిరి, జూలై 3 (ఆంధ్రజ్యోతి): తల్లికి వందనం కుటుంబానికి భరోసా అని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే నివాసంలోని కుట్టు శిక్షణలో ఉన్న మహిళలతో కలిసి తల్లికి వందనం పథకం విజయవంతంగా తల్లులకు చేరిన సందర్భంగా గురువారం సంబరాలు చేసుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర కేకును కట్‌ చేసి తల్లులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్‌సిక్స్‌ హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు తల్లికి వందనం పథకం కింద లక్షలాది మంది మహిళామణుల ఖాతాల్లో నగదు జమ చేసినట్లు తెలిపారు. అర్ధంతరంగా చదువులను ఆపివేసి ఇబ్బందులు పడుతున్న వారి కుటుంబాలలోని పిల్లలందరికి విద్యాభివృద్ధికి సీఎం చంద్రబాబు బాటలు వేశారన్నారు. కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2025 | 11:40 PM