రేషన్ స్మార్ట్ కార్డులు రెడీ!
ABN , Publish Date - Oct 11 , 2025 | 01:16 AM
జిల్లాలో తెల్లరే షన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డుల పంపిణీకి పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ పంపిణీలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. అందులో భాగంగా స్మార్ట్ కార్డులను తీసుకొచ్చింది. రేషన్ కార్డు అన్ని ప్రభుత్వ పథకాలకు కీలకమైంది.
నేడు ఒంగోలులో పంపిణీ
పాల్గొననున్న మంత్రి స్వామి, ఎమ్మెల్యే జనార్దన్, కలెక్టర్
ఏర్పాట్లు చేసిన పౌరసరఫరాల శాఖ
ఒంగోలు కలెక్టరేట్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో తెల్లరే షన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డుల పంపిణీకి పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ పంపిణీలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. అందులో భాగంగా స్మార్ట్ కార్డులను తీసుకొచ్చింది. రేషన్ కార్డు అన్ని ప్రభుత్వ పథకాలకు కీలకమైంది. కొంతమంది లబ్ధిదారుల వేలిముద్రలు పడకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈనేపథ్యంలో కార్డుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్మార్ట్‌కార్డుల జారీకి ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వీటిని పంపిణీ చేశారు. మన జిల్లాలో శనివారం నుంచి ప్రారంభిస్తున్నారు.
జిల్లాకు వచ్చిన 6.51 లక్షల స్మార్ట్ కార్డులు
జిల్లాలో 6.61లక్షల తెల్లరేషన్ కార్డుదారులు ఉన్నాయి. ప్రస్తుతం చెన్నై నుంచి జిల్లాకు 6.51 లక్షల స్మార్ట్ కార్డులు వచ్చాయి. వాటిని మండలాల వారీగా తహసీల్దార్ కార్యాలయాలకు చేర్చారు. ఈ స్మార్ట్‌కార్డు క్యూఆర్ కోడ్ లేదా స్వై పింగ్ ద్వారానైనా రేషన్ తీసుకునే వెసులుబాటును ప్రభు త్వం కల్పించింది. వీటిని జిల్లా కేంద్రమైన ఒంగోలులో శనివారం సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి, ఒంగోలు శాసన సభ్యుడు దామచర్ల జనార్దన్, కలె క్టర్ రాజాబాబు పంపిణీ చేయనున్నారు. అందుకు సంబం ధించిన ఏర్పాట్లను అధికారులు చేశారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో శాసనసభ్యుల సమక్షంలో పంపిణీకి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.