Share News

నేటి నుంచి రేషన్‌ పంపిణీ

ABN , Publish Date - Oct 01 , 2025 | 02:11 AM

జిల్లాలో బుధవారం నుంచి రేషన్‌ పంపిణీ ప్రారంభవుతోంది. అందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 1,392 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. వాటి ద్వారా 6.61 లక్షల కార్డుదారులకు బియ్యం, చక్కెరను పంపిణీ చేస్తున్నారు.

నేటి నుంచి రేషన్‌ పంపిణీ

ఈనెలలో కూడా కందిపప్పు లేదు

ఒంగోలు కలెక్టరేట్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో బుధవారం నుంచి రేషన్‌ పంపిణీ ప్రారంభవుతోంది. అందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 1,392 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. వాటి ద్వారా 6.61 లక్షల కార్డుదారులకు బియ్యం, చక్కెరను పంపిణీ చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కార్డుదారులకు మొబైల్‌ వాహనాల ద్వారా సరుకులు ఇవ్వగా, ప్రస్తుత ప్రజా ప్రభుత్వం రేషన్‌ షాపుల ద్వారా రెండు పూటలా పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంది. వృద్ధులు, దివ్యాంగులకు ముందుగానే వారి నివాసాల వద్దకు వెళ్లి సరుకులు అందిస్తోంది. కాగా జిల్లాలో రేషన్‌ కార్డుదారులకు అక్టోబరులో కూడా కందిపప్పు లేదు. ఎనిమిది నెలల నుంచి రేషన్‌ షాపులకు కందిపప్పు సరఫరా నిలిచిపోయింది. బహిరంగ మార్కెట్లో ధర అమాంతంగా పెరిగిపోవడంతో సబ్సిడీపై ఇచ్చే కందిపప్పును తీసుకునేందుకు పేదలు ఎదురుచూస్తున్నారు. అయితే ఈనెలలో కూడా ఆ అవకాశం లేకుండా పోయింది. కార్డుదారులకు డీలర్లు కేవలం బియ్యం, పంచదార మాత్రమే ఇవ్వనున్నారు.

Updated Date - Oct 01 , 2025 | 02:11 AM