రేషన్ పంపిణీ ప్రారంభం
ABN , Publish Date - Dec 02 , 2025 | 01:55 AM
జిల్లావ్యాప్తంగా రేషన్ పంపిణీ ప్రారం భమైంది. మొత్తం 1,392 దుకాణాల పరిధిలో 6.71 లక్షల స్మార్ట్ కార్డుదారులకు సోమవారం నుంచి బియ్యం, జొన్నలు, పంచదారను ఇస్తున్నారు. తొలిరోజు సాయంత్రం ఆరు గంటలకు 1.94 లక్షల (29శాతం) మంది రేషన్‌ను అందుకున్నారు.
తొలిరోజే 29శాతం కార్డుదారులకు అందజేత
ఒంగోలు కలెక్టరేట్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : జిల్లావ్యాప్తంగా రేషన్ పంపిణీ ప్రారం భమైంది. మొత్తం 1,392 దుకాణాల పరిధిలో 6.71 లక్షల స్మార్ట్ కార్డుదారులకు సోమవారం నుంచి బియ్యం, జొన్నలు, పంచదారను ఇస్తున్నారు. తొలిరోజు సాయంత్రం ఆరు గంటలకు 1.94 లక్షల (29శాతం) మంది రేషన్‌ను అందుకున్నారు. అత్యధికంగా సంతనూతలపాడు మండలంలో 6,064 (40.86శాతం) మంది కార్డుదారులు సరుకులు తీసుకున్నారు. అతితక్కువగా పొన్నలూరు మండలంలో 2,516 (19.16శాతం) మంది మాత్రమే రేషన్ అందుకున్నారు. ఉదయం, సాయంత్రం డీలర్లు రేషన్ పంపిణీ చేస్తుండ టంతో కార్డుదారులు వారికి అనుకూలమైన సమయంలో వెళ్లి తెచ్చుకుంటున్నారు.