Share News

రాజముద్రతో రేషన్‌ కార్డులు

ABN , Publish Date - Oct 12 , 2025 | 10:58 PM

జగన్‌ ఫొటోలు తొలగించి తిరిగి రాజముద్రతో కొత్త స్మార్ట్‌ రేషన్‌ కార్డులు, పాసుపుస్తకాలను ప్రభుత్వం అందజేస్తుందని టీడీపీ నాయకుడు ముత్తుముల కృష్ణకిషోర్‌రెడ్డి అన్నారు.

రాజముద్రతో రేషన్‌ కార్డులు
కార్డులను పంపిణీచేస్తూన్న కృష్ణకిషోర్‌రెడ్డి

టీడీపీ నేత కృష్ణకిషోర్‌రెడ్డి

కొమరోలు, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి) : జగన్‌ ఫొటోలు తొలగించి తిరిగి రాజముద్రతో కొత్త స్మార్ట్‌ రేషన్‌ కార్డులు, పాసుపుస్తకాలను ప్రభుత్వం అందజేస్తుందని టీడీపీ నాయకుడు ముత్తుముల కృష్ణకిషోర్‌రెడ్డి అన్నారు. మండంలోని గుండ్రెడ్డిపల్లి, అక్కపల్లి, ముత్తరాసుపల్ల్లి రేషన్‌ షాపుల్లో ఆదివారం స్మార్ట్‌ రేషన్‌ కార్డులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో రాజముద్రల స్థానంలో జగన్‌రెడ్డి ఫొటోలను ముద్రిం చి రాజ్యాంగాన్ని అవహేళన చేశారన్నా రు. రేషన్‌ కార్డులు, పొలం పాసుపుస్తకాలు, ఇళ్ల పట్టాలు చివరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పెట్టే కోడిగుడ్లపై కూడా జగన్‌రెడ్డి ఫొటోలు ముద్రించడాన్ని ప్రజలు అసహ్యించుకున్నారన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజముద్రలతో ముద్రించిన పాసుపుస్తకాలు, ఇప్పుడు రేషన్‌ కార్డులను పంపిణీ చేస్తుందని తెలిపారు. రాజముద్రతో ఉన్న మీ పాసుపుస్తకాలకు రక్షణ ఉంటుందని కృష్ణకిషోర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని అన్ని రేషన్‌ షా పులకు చెందిన 11,378 స్మార్టు రేషన్‌కార్డులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వృద్ధులు, నడువలేని వారి ఇళ్లకి వెళ్లి డీలర్లే రేషన్‌ను పంపిణీ చేస్తారని చె ప్పారు. కార్యక్రమంలో ఇడమకల్లు సొసై టీ అధ్యక్షుడు బిజ్జం రవీంద్రారెడి, పార్టీ మండల అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్‌ బిజ్జం వెంకట్రామిరెడ్డి, వీఆర్వో నాయబ్‌, నాయకులు మారె శ్రీనివాసులు, అనపా వీరశేఖర్‌, నాగూర్‌, చెక్కా పుల్లయ్య పాల్గొన్నారు.

రేషన్‌ సరుకులకు గట్టి భద్రత

రాచర్ల : స్మార్ట్‌ రేషన్‌ కార్డులు రేషన్‌ సరుకులకు భద్రత ఉంటుందని కూటమి నాయకులు అన్నారు. స్మార్ట్‌ రేషన్‌ కార్డులను ఆదివారం వారు గ్రామాల్లోని ప్రజలకు ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు. చోళ్లవీడులో బత్తిని రామకృష్ణ, శిరిగిరి శ్రీనివాసులు, చిన్నగానిపల్లిలో కంబాల రమణ, సోమిదేవిపల్లిలో బుడమ నాగేశ్వర రెడ్డి, కప్పెట వెంకటేశ్వర రెడ్డి, రెగాని రమణ, సంగపేటలో మార్కెట్‌ యార్డ్‌ డైరెక్టర్‌ కె అనోజీరావు, గుడిమెట్టలో రెడ్డి కాశిరెడ్డి, ఆయా గ్రామాల వీఆర్వోలు డీయోనా, ఆర్‌ శివపార్వతి, బీ కిషోర్‌ కుమార్‌, ఏ మాచర్ల, అధికారులతో కలిసి కార్డులను పంపిణీ చేశారు.

Updated Date - Oct 12 , 2025 | 10:58 PM