Share News

శరవేగంగా హాస్టల్‌ భవన నిర్మాణం

ABN , Publish Date - Dec 22 , 2025 | 11:26 PM

ముం డ్లమూరులోని ఏపీ మోడల్‌ స్కూల్‌లో హాస్టల్‌ భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందు కోసం సమగ్ర శిక్ష నిధులు రూ.2.53 కోట్లు మంజూ రయ్యాయి. ఇప్పటికే 90 శాతంమేర పనులు పూర్త య్యాయి.

శరవేగంగా హాస్టల్‌ భవన నిర్మాణం
మోడల్‌ స్కూల్‌లో నిర్మిస్తున్న హాస్టల్‌ భవననం

రూ.4.21 కోట్లతో అభివృద్ధి పనులు

తీరనున్న మోడల్‌ స్కూల్‌ బాలికల సమస్య

ముండ్లమూరు, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): ముం డ్లమూరులోని ఏపీ మోడల్‌ స్కూల్‌లో హాస్టల్‌ భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందు కోసం సమగ్ర శిక్ష నిధులు రూ.2.53 కోట్లు మంజూ రయ్యాయి. ఇప్పటికే 90 శాతంమేర పనులు పూర్త య్యాయి. ఆరు నుంచి ఇంటర్‌ వరకు వంద మంది బాలికలు హాస్టల్‌లో ఉండేవిధంగా 20 గదులు నిర్మిం చారు. వార్డెన్‌ రూమ్‌, కిచన్‌, డైనింగ్‌ హాల్‌తో పాటు ల్రైబరీ రూమ్‌ కూడా రూపక ల్పన చేశారు. ప్రజాప్రభు త్వం వచ్చిన తరువాత మొదలుపె ట్టిన హాస్టల్‌ భవనం శరవేగం గా పూర్తిచేశారు. వచ్చే ఏడాది ఏపీ మోడల్‌ స్కూల్‌ పునఃప్రా రంభం నాటికి హాస్టల్‌లో వి ద్యార్థినులు ఉండేవిధంగా ఏ ర్పాట్లుచేస్తున్నారు. ఈ భవనం పూర్తయితే సుదూర ప్రాంతా లకు చెందిన విద్యార్థినులు హా స్టల్‌లో ఉండనున్నారు.

అలాగే, కేజీబీవీ పాఠశాలలో విద్యార్థినుల కోసం అదనంగా నాలుగు గదులు నిర్మిస్తున్నారు. ఇవికాక మ రో రూ.1.20 కోట్లతో కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, బయోజికల్‌ ల్యాబ్‌ కోసం గదులు నిర్మిస్తున్నారు. అదనపు గదుల నిర్మాణం 90 శాతం మేర పూర్తయ్యాయి. ల్యాబ్‌లకు సంబధించి ఇటీవల పునాదులు తీసి పనులు ప్రారంభించారు. 2026 ఏప్రిల్‌ నాటికి పూర్తిగా అదనపు గదు లతో పాటు అన్ని సౌకర్యాలు పూర్తి కానున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో హాస్టల్‌ భవనా నికి నిధులు మంజూరైనా పనులుచేయలేదు. దీంతో విద్యార్థినులు ఇళ్ళ నుంచి ఏపీ మోడల్‌ స్కూల్‌కు వచ్చి తిరిగి సాయంత్రం పూట వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడిం ది. ఆసమయంలో బస్సులు సకాలంలో లేక పోవటంతో ఇంటికి వెళ్ళేసరికి రాత్రి అవుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ఇదిలాఉంటే, కేజీబీవీలో విద్యార్థినులు విద్యను అభ్యసించటానికి సరిపడనన్ని గదులు లేక ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి విద్యార్థినుల ఇబ్బందులను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌, అప్పటి జిల్లా కలెక్టర్‌ తమీ మ్‌ అన్సారియా దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరుచే యించారు. దీంతో త్వరలోనే ఏపీ మోడల్‌ స్కూల్‌, కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థినుల కష్టాలు తీరనున్నాయి.

Updated Date - Dec 22 , 2025 | 11:26 PM