నేడు ఒంగోలుకు రామ్‌గోపాల్ వర్మ
ABN , Publish Date - Aug 12 , 2025 | 02:42 AM
ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ విచారణ నిమిత్తం మంగళవారం ఒంగోలు రానున్నారు. వ్యూహం చిత్రం ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్య మంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్‌పై సోషల్ మీడియాలో ఆయన అనుచిత పోస్టులు పెట్టడంపై మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైన విషయం విదితమే.
పోలీస్ విచారణకు హాజరు
ఒంగోలు క్రైం, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ విచారణ నిమిత్తం మంగళవారం ఒంగోలు రానున్నారు. వ్యూహం చిత్రం ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్య మంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్‌పై సోషల్ మీడియాలో ఆయన అనుచిత పోస్టులు పెట్టడంపై మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైన విషయం విదితమే. విచారణలో భాగంగా గత ఫిబ్రవరి నెలలో ఒంగోలు రూరల్ సీఐశ్రీకాంత్ ఎదుట హాజరైన వర్మ సరైన సమాధానం చెప్పలేదు. అయితే ఆయన హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోరారు. పోలీసు చర్యలు ఏమీ లేకుండా విచారణాధికారికి సహకరించాలని హైకోర్టు వర్మను ఆదేశించింది. దీంతో గతనెల 22న వర్మకు ఒంగోలు రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన ఈనెల 12న హాజరవుతానని సమాధానం ఇచ్చారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఒంగోలులోని తాలూకా పోలీసు స్టేషన్‌లో సీఐ శ్రీకాంత్‌బాబు ఎదుట వర్మ హాజరు కానున్నారు.