కలెక్టర్‌గా రాజాబాబు
ABN , Publish Date - Sep 12 , 2025 | 02:21 AM
జిల్లా నూతన కలెక్టర్‌గా పాలేటి రాజాబాబు నియమితులయ్యారు. రాష్ట్రంలో 12 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ పనిచేస్తున్న తమీమ్ అన్సారియాను గుంటూరు కలెక్టర్‌గా బదిలీ చేసింది. ఆ స్థానంలో ప్రస్తుతం ఏపీ పబ్లిక్ సర్వీసు కమిషన్ సెక్రటరీగా పనిచేస్తున్న పాలేటి రాజాబాబును నియమించింది.
గుంటూరుకు అన్సారియా బదిలీ
ఒంగోలు, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : జిల్లా నూతన కలెక్టర్‌గా పాలేటి రాజాబాబు నియమితులయ్యారు. రాష్ట్రంలో 12 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ పనిచేస్తున్న తమీమ్ అన్సారియాను గుంటూరు కలెక్టర్‌గా బదిలీ చేసింది. ఆ స్థానంలో ప్రస్తుతం ఏపీ పబ్లిక్ సర్వీసు కమిషన్ సెక్రటరీగా పనిచేస్తున్న పాలేటి రాజాబాబును నియమించింది. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వర్ధిపర్రు గ్రామానికి చెందిన రాజాబాబు డిగ్రీ వరకు నరసాపురంలో చదివారు. ఆంధ్రా యూనివర్సిటీలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2000 సంవత్సరంలో గ్రూపు-1 అధికారిగా ఎంపికయ్యారు. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో సీటీవోగా సర్వీసులో చేరిన ఆయన ఆ శాఖలో డిప్యూటీ కమిషనర్ వరకు హైదరాబాద్, సికింద్రాబాద్, నల్గొండ, విజయనగరం, గుంటూరులలో పనిచేశారు. 2013లో ఐఏఎస్ కేడర్‌కు ఎంపికయ్యారు. గ్రేటర్ విశాఖ కమిషనర్‌గా, స్కిల్ డెవలప్‌మెంట్ సీఈవోగా, సెర్ప్ సీఈవోగా, హౌసింగ్ ఎండీగా పలు పోస్టులలో బాధ్యతలు నిర్వహించారు. 2023 ఏప్రిల్ నుంచి 2024 ఏప్రిల్ వరకు కృష్ణా జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ఈ ఏడాదే ఏపీపీఎస్‌సీ సెక్రటరీగా నియమితులై ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్నారు. తాజా బదిలీల్లో ఆయన్ను ప్రభుత్వం జిల్లాకు కలెక్టర్‌గా నియమించింది. ప్రస్తుతం ఇక్కడ కలెక్టర్‌గా పనిచేస్తున్న తమీమ్ అన్సారియా గుంటూరు కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి జరిగిన బదిలీల్లో 2024 జూన్ 27న ఇక్కడ కలెక్టర్‌గా అన్సారియా బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్‌గా తొలి పోస్టింగ్ అయినప్పటికీ ఈ 14 నెలల కాలంలో జిల్లాలో బాగా పనిచేశారన్న పేరు అన్నివర్గాల్లోనూ పొందారు. బంగారు బాల్యం, కంగారు వంటి ప్రత్యేక కార్యక్రమాలను ఆమె చేపట్టారు. బంగారు బాల్యం కార్యక్రమానికి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉన్న స్కౌచ్ అవార్డు కూడా లభించింది.