గాలులతో వర్షం
ABN , Publish Date - May 17 , 2025 | 11:45 PM
మార్కాపురం పట్టణ, మండల పరిధిలో శనివారం సా యంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉక్కపోత వాతావరణం ఉంది. ఉష్ణోగ్రత కూడా అత్యధికంగా నమోదైంది.
మార్కాపురం, మే 17 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురం పట్టణ, మండల పరిధిలో శనివారం సా యంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉక్కపోత వాతావరణం ఉంది. ఉష్ణోగ్రత కూడా అత్యధికంగా నమోదైంది. సాయంత్రం 4.00 గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సుమారు 5.30 గంటల వరకు వర్షం ఎడతెరపి లేకుండా కురిసింది. దీంతో పట్టణంలోని కొన్ని లోతట్టు ప్రాంతాలు, రహదారులపై వర్షపు నీళ్లు నిలిచాయి. పట్టణంతోపాటు, చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మోస్తరు వర్షం కురిసింది. కొన్నిచోట్ల చెట్లు నేలకొరిగాయి.