Share News

ఎంపీడీవో కార్యాలయంలో వాన కష్టాలు

ABN , Publish Date - Sep 10 , 2025 | 10:21 PM

మండల పరిషత్‌ కార్యాలయ సిబ్బందికి వాన కష్టాలు తప్పడం లేదు. ఎక్కడ కూర్చోవాలి, ఎలా విధు లు చేపట్టాలి, ఫైల్స్‌ను ఎలా కాపాడుకోవాలో తెలియక తలలుపట్టుకుంటున్నారు.

ఎంపీడీవో  కార్యాలయంలో వాన కష్టాలు
ఎంపీడీవో కార్యాలయంలో ఓ గదిలో కారి నిలిచి ఉన్న వర్షం నీరు

చినుకు పడితే కూర్చునే పరిస్థితి లేదు

ఊడిపోయిన కప్పులు, తిరగని ఫ్యాన్‌లు

రికార్డులు, కంప్యూటర్లు కాపాడేందుకు అవస్థలు

ఎర్రగొండపాలెం రూరల్‌, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : మండల పరిషత్‌ కార్యాలయ సిబ్బందికి వాన కష్టాలు తప్పడం లేదు. ఎక్కడ కూర్చోవాలి, ఎలా విధు లు చేపట్టాలి, ఫైల్స్‌ను ఎలా కాపాడుకోవాలో తెలియక తలలుపట్టుకుంటున్నారు. ఎప్పుడో బ్రిటీష్‌ కాలంలో కట్టిన భవనం కావడంతో పై కప్పులు పగిలి పోయాయి. దీంతో ఫ్లేవుడ్‌తో మరమ్మతులు చేశారు. ప్రస్తుతం అవి పగిలిపోయి, ఊడిపోతున్నాయి. ఈ క్రమంలో చిన్న పాటి వర్షం కురిస్తే కారిపోతుంది. దీంతో ఇటు సిబ్బంది, పనులు నిమిత్తం వచ్చే ప్రజలు కార్యాలయంలో కూర్చునే పరిస్థితి లేదు. అదే రూంలో కంప్యూటర్‌, రికార్డులు ఉన్నాయి. వర్షం పడిన ప్రతిసారీ ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్నారు. ఒక వేళ విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ జరిగితే పెను ప్రమాదం తప్పదని ఆందోళన చెందుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేయాలని ప్రజలు, సిబ్బంది కోరుతున్నారు.

Updated Date - Sep 10 , 2025 | 10:21 PM