రాడికల్ హ్యూమనిస్టు సెంటర్ ప్రధానకార్యదర్శి హరిబాబు మృతి
ABN , Publish Date - Dec 15 , 2025 | 10:36 PM
ఇంకొల్లు రాడికల్ హ్యూమనిస్టు సెంటర్ ప్రధానకార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాడికల్ హ్యూమనిస్టు అసోసియేషన్ ప్రధానకార్యదర్శి,హేతువాది పత్రిక సహాయసంపాదకులు కరి హరిబాబు(69) సోమవారం ఉదయం ఇంకొల్లులో మృతి చెందారు.
ఇంకొల్లు, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : ఇంకొల్లు రాడికల్ హ్యూమనిస్టు సెంటర్ ప్రధానకార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాడికల్ హ్యూమనిస్టు అసోసియేషన్ ప్రధానకార్యదర్శి,హేతువాది పత్రిక సహాయసంపాదకులు కరి హరిబాబు(69) సోమవారం ఉదయం ఇంకొల్లులో మృతి చెందారు. ఆయన 40 సంవత్సరాలుగా నాస్తిక, హేతువాద మానవవాద ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేశారు. ఇంకొల్లు రాడికల్ హ్యూమనిస్టు భవన నిర్మాణంలో, 24 సంవత్సరాలుగా హేతువాద పత్రిక పంపిణీ కార్యక్రమంలో కీలకపాత్ర పోషించారు. ఆయన మృతికి పలు సంఘాల సభ్యులు సంతాపాన్ని తెలియజేశారు. హేతువాద ప్రముఖులు ఆయన మృతదేహాన్ని సందర్శించారు.