Share News

అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

ABN , Publish Date - Dec 26 , 2025 | 11:31 PM

మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని గుంటూరు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ రీజనల్‌ డైరెక్టర్‌ హరికృష్ణ అన్నారు. శుక్రవారం ఆయన గిద్దలూరు మున్సిపల్‌ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
అధికారులతో సమీక్షిస్తున్న గుంటూరు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ రీజనల్‌ డైరెక్టర్‌ హరికృష్ణ

గిద్దలూరు టౌన్‌, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని గుంటూరు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ రీజనల్‌ డైరెక్టర్‌ హరికృష్ణ అన్నారు. శుక్రవారం ఆయన గిద్దలూరు మున్సిపల్‌ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. పట్టణాభివృద్ధి పనులు, పారిశుధ్య నిర్వహణ, మున్సిపాలిటీలో తాగునీటి సరఫరా విధానం, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వీధిదీపాల నిర్వహణతోపాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో తీసుకుంటున్న చర్యలను మున్సిపల్‌ కమిషనర్‌ ఇ.వి.రమణబాబు రీజనల్‌ డైరెక్టర్‌కు వివరించారు. రీజనల్‌ డైరెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా అందించేందుకు మున్సిపాలిటీ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీలో చేపడుతున్న అభివృద్ధి పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆయన సూచించారు. భవిష్యత్తులో కూడా ప్రజల అవసరాలకు అనుగుణంగా మెరుగైన సేవలు అందించేందుకుఎప్పటికప్పుడు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2025 | 11:31 PM