నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
ABN , Publish Date - Sep 25 , 2025 | 10:38 PM
పెట్రోల్ బంకులలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్ హెచ్చరించారు. మండలంలోని రా యవరం వద్ద పెట్రోల్, డీజిల్ బంకులలో గురువారం ఆకస్మిక తనిఖీ తహసీల్దార్ చిరంజీవితో కలిసి చేశారు. బంకులలో పంపు మిషన్‌లను, వాటిలో పొందుపరిచిన వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకుని పరిశీలించారు.
పెట్రోల్ బంకుల తనిఖీలో సబ్ కలెక్టర్ త్రివినాగ్
మార్కాపురం రూరల్, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : పెట్రోల్ బంకులలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్ హెచ్చరించారు. మండలంలోని రా యవరం వద్ద పెట్రోల్, డీజిల్ బంకులలో గురువారం ఆకస్మిక తనిఖీ తహసీల్దార్ చిరంజీవితో కలిసి చేశారు. బంకులలో పంపు మిషన్‌లను, వాటిలో పొందుపరిచిన వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకుని పరిశీలించారు. నిర్వాహకులతో త్రివినాగ్ మాట్లాడుతూ కొలతలు, నాణ్యత విషయంలో ఎటువంటి అవకతవకలు జరిగినా సహించేది లే దని హెచ్చరించారు.
ఎర్రగొండపాలెం : ఎర్రగొండపాలెం మార్కాపురం రోడ్‌లో ని పెట్రోల్ బంక్‌ను గురువారం తహసీల్దార్ మంజునాథరెడ్డి తనిఖీ చేశారు. పెట్రోల్ కొట్టే మిషన్, మీటర్ రీడింగ్‌ను పరిశీలించారు. బంకుల వద్ద వినియోగదారులకు సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. కొలతల్లో తేడాలొస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.