Share News

నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

ABN , Publish Date - Jun 09 , 2025 | 11:01 PM

తరగతి గదుల నిర్మాణాలు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని శాసనసభ్యులు ముత్తుముల అశోక్‌రెడ్డి చెప్పారు. రాచర్ల కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయంలో అప్‌గ్రేడ్‌ జూనియర్‌ కళాశాల తరగతి గదుల నిర్మాణానికి సోమవారం ఆయన భూమి పూజ చేశారు

నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
అర్ధవీడులో భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌ౄరెడ్డి

రాచర్ల, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): తరగతి గదుల నిర్మాణాలు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని శాసనసభ్యులు ముత్తుముల అశోక్‌రెడ్డి చెప్పారు. రాచర్ల కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయంలో అప్‌గ్రేడ్‌ జూనియర్‌ కళాశాల తరగతి గదుల నిర్మాణానికి సోమవారం ఆయన భూమి పూజ చేశారు. సమగ్ర శిక్ష అభియాన్‌ ద్వారా దాదాపు రూ. 1.52 కోట్లు నిధులు మంజూరయ్యాయని, ఆ నిధులతో తరగతి గదుల నిర్మాణం చేపట్టినట్లు ఆయన తెలిపారు. నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని, భవన నిర్మాణాలు పటిష్ఠంగా ఉండాలని చెప్పాపరు. తొలుత ఎమ్మెల్యే అశోక్‌రెడ్డికి పాఠశాల ఎస్‌వో డి.మాలకొండమ్మ, అధికారులతో కలిసి ఘనస్వాగతం పలికారు. ఈకార్యక్రమంలో పంచాయతీరాజ్‌ డీఈ ఎన్‌.వెంకటసుబ్బారెడ్డి, ఎంపీడీవో ఎస్‌వెంకటరామిరెడ్డి, తహసీల్దార్‌ ఎల్‌.వెంకటేశ్వర్లు, ఎంఈవో శివకోటేశ్వరరావు, సర్వశిక్ష అభియాన్‌ డీఈ పి.వి.రమణయ్య, ఏఈ మహేష్‌, నాయకులు కె.యోగానంద్‌, జి.జీవనేశ్వర్‌రెడ్డి, ఎన్‌.శ్రీనివాసులు, డి.కాశిరెడ్డి, పి.సనావుల్లాఖాన్‌, ఎ.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

అర్ధవీడులో రూ.1.59 కోట్లతో జూనియర్‌ కళాశాల అదనపు తరగతుల భవనం

అర్ధవీడు/కంభం, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి) : అర్ధవీడు మండలంలో కస్తూర్భా గాంధీ పాఠశాల ప్రాంగణంలో జూనియర్‌ కళాశాల అదనపు తరగతుల కోసం రూ.1.59 కోట్లు మంజూరయ్యాయి. ఈ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి సోమవారం భూమి పూజ చేశారు. ఈకార్యక్రమంలో ఎంపీడీవో నరసయ్య, తహసీల్దార్‌ నాగార్జునరెడ్డి, పంచాయతీ రాజ్‌ డీఈ సుబ్బారెడ్డి, బండ్లమూడి ఆంజనేయులు, పూనూరు భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jun 09 , 2025 | 11:01 PM