వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్
ABN , Publish Date - Nov 24 , 2025 | 11:42 PM
వినియోగదారులకు మెరుగైన విద్యుత్‌ను అందజేస్తు న్నట్టు ఏపీసీపీడీసీఎల్ ప్రాజెక్టు డైరెక్టర్ టీవీఎన్‌ఎస్ మూర్తి అన్నారు. సోమవారం సాయంత్రం ఆయన మండలంలోని మారెళ్ళలో విద్యుత్ సబ్‌స్టేషన్‌ను, సోలార్ ప్రాజెక్టును, శంకరాపురంలోని సోలార్ ఏర్పాటుచేసే కుసుంను పరిశీలించారు.
ముండ్లమూరు, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): వినియోగదారులకు మెరుగైన విద్యుత్‌ను అందజేస్తు న్నట్టు ఏపీసీపీడీసీఎల్ ప్రాజెక్టు డైరెక్టర్ టీవీఎన్‌ఎస్ మూర్తి అన్నారు. సోమవారం సాయంత్రం ఆయన మండలంలోని మారెళ్ళలో విద్యుత్ సబ్‌స్టేషన్‌ను, సోలార్ ప్రాజెక్టును, శంకరాపురంలోని సోలార్ ఏర్పాటుచేసే కుసుంను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో వినియోగ దారులకు మేలు చేసే విధంగా రాష్ట్రంలో అనేకచోట్ల సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. సోలార్ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయ్యే నాణ్యమైన విద్యుత్‌ను సబ్ స్టేషన్‌లకు అందజేసి తద్వారా రైతు లకు నాణ్యమైన విద్యుత్ అందించటం జరుగుతుం దన్నారు. పీఎం కుసుము ప్రాజెక్టు కింద అనువైన ప్రదేశాలను గుర్తిస్తున్నట్టు చెప్పారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ వినియోగ దారులకు అందించేందుకు మండ లాల్లో రెండు మూడు పీఎం కిసుం ప్రాజెక్టులు మం జూరు చేస్తున్నట్టు చెప్పారు. సూర్యఘర్ పథకం కింద గృహ వినియోగదారులకు సోలార్‌లు ఏర్పాటు చేయ టం జరుగుతుందన్నారు. బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వటానికి సంసిద్దత వ్యక్తం చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో ఈఈ పి.శ్రీనివాసులు, ఏడీఈ పి.రవికుమార్, ఏఈ టి. చినఅంకబాబు, తదితరు లు పాల్గొన్నారు.
సోలార్ పవర్ ప్లాంట్‌కు స్థల పరిశీలన
దర్శి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి) : మండలంలో సోలార్ విద్యుత్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు అధికారులు సోమవారం స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏపీసీపీడీసీఎల్ ప్రాజెక్టు, హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ టీవీఎ్‌సఎన్ మూర్తి రాజంపల్లి, బొడ్లపాలెం గ్రామాల్లో సబ్ స్టేషన్‌ల వద్ద స్థలాన్ని పరిశీలించారు. దేశవ్యాప్తంగా సోలార్ విద్యుత్ వాడకాన్ని వినియోగంలోకి తెచ్చే కార్యక్రమంలో భాగంగా సోలార్ పవర్ ప్లాంట్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు విద్యుత్ శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మూర్తి చెప్పారు. ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన స్థలాలను త్వరలో ఖరారు చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఈఈ పి.శ్రీనివాసులు, పి. రవికుమార్, ఏఈలు సచిన్‌కుమార్, వేణుగోపాల్ పా ల్గొన్నారు.