పూరిమెట్ల సర్పంచ్ చెక్ పవర్ రద్దు
ABN , Publish Date - Nov 18 , 2025 | 01:20 AM
ముండ్లమూరు మండలం పూరిమెట్ల గ్రామ పంచాయతీలో నిధులు దుర్వినియోగం చేసిన సర్పంచ్ టంగుటూరి రామాంజి చెక్ పవర్‌ను తాత్కాలికంగా రద్దుచేస్తూ డీపీవో వెంకటేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు.
పూరిమెట్ల సర్పంచ్ చెక్ పవర్ రద్దు
ఒంగోలు కలెక్టరేట్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : ముండ్లమూరు మండలం పూరిమెట్ల గ్రామ పంచాయతీలో నిధులు దుర్వినియోగం చేసిన సర్పంచ్ టంగుటూరి రామాంజి చెక్ పవర్‌ను తాత్కాలికంగా రద్దుచేస్తూ డీపీవో వెంకటేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామపంచాయతీ కార్యదర్శికి తెలియకుండా సర్పంచ్ ఒక విడత రూ.48,346, మరో విడత రూ.88,950 డ్రా చేశారు. దీనిపై ఫిర్యాదులు వచ్చాయి. వాటిపై విచారణ చేపట్టగా నిధులను అక్రమంగా డ్రా చేసుకున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో సర్పంచ్ రామాంజికి అధికారులు సంజాయిషీ నోటీసు ఇచ్చారు. వారంరోజుల్లోపు వివరణ ఇవ్వాలని అందులో సూచించారు. అయితే సర్పంచ్ వివరణ సమంజసంగా లేదని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో రూల్ 42(1) ప్రకారం అతని చెక్ పవర్‌ను మూడు నెలలపాటు తాత్కాలికంగా రద్దుచేస్తూ డీపీవో వెంకటేశ్వరరావు ఉత్తర్వులు జారీచేశారు.