Share News

స్టోరేజీలకు మొదలైన సాగర్‌ జలాల పంపింగ్‌

ABN , Publish Date - May 27 , 2025 | 11:02 PM

గ్రామాల్లోని ప్రజలకు తాగునీటి అవసరాల నిమిత్తం ప్రభుత్వం సాగర్‌ కెనాల్‌కు విడుదల చేసిన సాగర్‌ జలాలు మండలంలోని చందవరం సమీపంకు చేరుకున్నాయి.

స్టోరేజీలకు మొదలైన సాగర్‌ జలాల పంపింగ్‌
చందవరం-2 స్టోరేజీకి సాగర్‌ జలాలు నింపుతున్న దృశ్యం

దొనకొండ, మే 27(ఆంధ్రజ్యోతి) : గ్రామాల్లోని ప్రజలకు తాగునీటి అవసరాల నిమిత్తం ప్రభుత్వం సాగర్‌ కెనాల్‌కు విడుదల చేసిన సాగర్‌ జలాలు మండలంలోని చందవరం సమీపంకు చేరుకున్నాయి. చందవరం గ్రామ సమీపంలోని సాగర్‌ కెనాల్‌ వద్ద నిర్మించిన చందవరం-1, -2 సాగర్‌ జలాల స్టోరేజీలకు కెనాల్‌ నుంచి విద్యుత్‌ మోటార్ల ద్వారా పంపింగ్‌ చేస్తున్నారు. మండలంలోని 29 గ్రామాలకు నీటి సరఫరా చేసే చందవరం-1 స్టోరేజీలో 68 శాతం నీళ్లు ఉన్నాయని నూరుశాతం నింపేందుకు చర్యలు చేపట్టామని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ కిరణ్‌కుమార్‌ చెప్పారు. కొనకనమిట్ల, హెచ్‌ఎంపాడు, పొదిలి మండలాల్లోని 127 గ్రామాలకు సరఫరా జరిగే చందవరం-2 స్టోరేజీలో 50శాతం నీళ్లు ఉన్నాయని కెనాల్‌లో నీటి సరఫరా జరిగే వారం రోజుల్లో నూరుశాతం స్టోరేజీ నింపుతామని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ శ్రీకాంత్‌ తెలిపారు.

Updated Date - May 27 , 2025 | 11:02 PM