కూటమి ప్రభుత్వంతోనే ప్రజా సంక్షేమం
ABN , Publish Date - Jul 19 , 2025 | 12:36 AM
కూటమి ప్రభుత్వంలోనే ప్రజల సంక్షేమం సాధ్యపడుతుందని ఎంపీ మాగుంట శ్రీనివాసు లురెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేర్కొన్నా రు.
ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే దామచర్ల
11,13 డివిజన్లలో కొనసాగిన సుపరిపాలనలో తొలిఅడుగు
ఒంగోలు కార్పొరేషన్, జూలై 18 (ఆంధ్రజ్యో తి): కూటమి ప్రభుత్వంలోనే ప్రజల సంక్షేమం సాధ్యపడుతుందని ఎంపీ మాగుంట శ్రీనివాసు లురెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేర్కొన్నా రు. సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమాన్ని శుక్రవారం నగరంలోని 11, 13వ డివిజన్‌లలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుం ట, ఎమ్మెల్యే దామచర్ల ప్రతి ఇంటికీ వెళ్ళి ప్రజ లను పలకరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకా లు అందుతున్నాయా.. లేదా అని అడిగి తెలు సుకున్నారు. పలు కాలనీల్లో పింఛన్లు అందడం లేదని, మరికొందరు రేషన్ కార్డుల సమస్యల గురించి, తాగునీరు, పారిశుధ్యం సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో స్పందించిన మాగుంట, దామచర్ల ఆయా సమస్యలను సత్వ రమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం మీడియాతో ఎంపీ మాగుంట మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క రూ సంతోషంగా ఉన్నారన్నారు. ప్రతి ఇల్లూ సంతోషంగా ఉండాలని సీఎం చంద్రబాబునా యుడు నిరంతరం కృషి చేస్తున్నారని, సూపర్ సిక్స్ పథకాలతో ప్రతి కుటుంబానికి సంక్షేమం లభిస్తుందని చెప్పారు. ఎమ్మెల్యే దామచర్ల మా ట్లాడుతూ బాధ్యతలు తీసుకున్న తొలిరోజే పిం ఛన్ల పెంపుపై సీఎం సంతకం చేశారన్నారు. అ లాగే అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, రైతు భరోసా, డీఎస్సీ అమలు చేశారన్నారు.
దాంతోపాటు వచ్చే నెలలో ప్రతి మహిళ ఆర్టీసీ బస్సులో ఉచి తంగా ప్రయాణించే అవకాశం కల్పించారన్నారు. ఇప్పటికే నగరంలో అభివృద్ధి పనులు వేగవం తంగా జరుగుతున్నాయని, అలాగే అయ్యన్నశెట్టి సత్రం పట్టాల సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో షేక్ కపిల్‌బాషా, గంగవరపు సందీప్, రమేష్, గు ర్రాల రాజ్‌విమల్, టీఎస్‌సింగ్, శశికాంత్‌భూ షణ్, నగర అధ్యక్షుడు బండారు మదన్, కొఠారి నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.