Share News

ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Jul 18 , 2025 | 01:07 AM

ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర దేవదాయ శాఖమంత్రి ఆ నం రాంనారాయణరెడ్డి అన్నారు. గురువారం కనిగిరి లో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభిం చారు.

ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడుతున్న మంత్రి ఆనం, పక్కన ఎమ్మెల్యే ఉగ్ర

మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి

కనిగిరి, జూలై 17(ఆంధ్రజ్యోతి): ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర దేవదాయ శాఖమంత్రి ఆ నం రాంనారాయణరెడ్డి అన్నారు. గురువారం కనిగిరి లో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభిం చారు. తొలుత స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డితో కలసి సీఎంఆర్‌ఎఫ్‌ కింద 38 మంది లబ్ధిదారులకు రూ24.26లక్షల చెక్కులు పంపిణీ చేశారు.

అనంతరం పట్టణంలోని 16, 17 వా ర్డుల్లో ఏడాది సుపరిపాలన కార్యక్రమం సందర్భంగా సుగుణావతమ్మ సెంటర్‌, నగరికంటి బసవయ్య సెంటర్‌లోని వివిధ వ్యాపారవర్గాలతో మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ను వివరించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ లను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ఘనత చంద్ర బాబుదేనని అన్నారు. అధికారం కోల్పోయిన వైసీపీ నేతలు రాష్ట్రంలో అరాచకాలను సృష్టించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారన్నారు. వాటిని ప్రజలు త్రిప్పికొట్టాలని పిలుపుని చ్చారు.

కార్యక్రమంలో ఆర్డీవో కేశవర్ధన్‌రెడ్డి, డీఎస్పీ సాయి ఈశ్వర్‌ యశ్వంత్‌, తహసీ ల్దార్‌ రవిశంకర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణమోహన్‌ రెడ్డి, టీడీపీ మండల కన్వీనర్‌ పిచ్చాల శ్రీనివాసు లురెడ్డి, పట్టణా ధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసులురెడ్డి, హెచ్‌ఎంపాడు అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దేవాలయ షాపింగ్‌ కాంపెక్స్‌కు శంకుస్థాపన

నగరికంటి బసవయ్య సెంటర్‌ వద్ద ఉన్న విజయ మార్తేండేశ్వరస్వామి దేవస్థానానికి సంబంధించిన స్థలంలో షాపింగ్‌ కాంపెక్స్‌కు గురువారం మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రతో క లసి శంకుస్థాపన చేశారు. వేద పండితులు పూర్ణకుం భంతో మంత్రికి స్వాగతం పలికారు. తొలుత మార్తేండే శ్వరస్వామి విగ్రహానికి పూజలు చేశారు. ఈసందర్భం గా దేవాలయ ఈవో శ్రీగిరిరాజు మంత్రి ఆనం, ఎమ్మె ల్యే డాక్టర్‌ ఉగ్రను సత్కరించారు. కార్యక్రమంలో పర్య వేక్షకులు మారుతి, కోటా సురేష్‌, వీవీఆర్‌ మనోహర రావు, దేవస్థాన మాజీ అధ్యక్షుడు గోంట్ల మల్లికార్జున తదితరులు

పాల్గొన్నారు. అనంతరం పట్టణ సమీపంలోని గార్లపేట రోడ్డులో మోడల్‌ స్కూల్‌కు వెళ్లేందుకు కోటి రూపాయలతో చేపడుతున్న రోడ్డుకు ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డితో కలసి మంత్రి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

పామూరులో సన్మానం

పామూరు, జూలై 17 (ఆంధ్రజ్యోతి): కనిగిరి పర్య టన ముగించుకొని నెల్లూరు వెళుతున్న మంత్రి ఆనం రాంనారాయణరెడ్డిని, ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర నరసింహా రెడ్డిని గురువారం పామూరులో గజమాలతో సత్కరిం చారు. సత్కరించినవారిలో టీడీపీ మండల అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు, ఆకుపాటి వెంకటేష్‌, ఉప్పలపాటి హరిబాబు, అడుసుమల్లి ప్రభాకర్‌చౌదరి, తదితరులు ఉన్నారు. ఈసందర్భంగా దేవస్థా భూములు అన్యా క్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని బీజేపీ నియో జకవర్గ ఇన్‌చార్జ్‌ కేవీ రమణయ్య మంత్రికి వినతిపత్రం అందజేశారు. కాగా,

ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం లో గాయపడి నెల్లూరులో వైద్యం అనంతరం ఇంటివద్ద విశ్రాంతి తీసుకొంటున్న టీడీపీ పట్టణ ఉపాద్యక్షుడు ఇర్రి కోటిరెడ్డిని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర పరామర్శించారు.

Updated Date - Jul 18 , 2025 | 01:07 AM