ప్రజాసంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Jul 14 , 2025 | 11:14 PM
ప్రజాసంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. కుటుంబ సాధికార సభ్యులు (కేఎస్‌ఎస్) కూటమి ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధిని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.
అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలి
మంత్రులు గొట్టిపాటి, స్వామి
కనిగిరి, జూలై 14(ఆంధ్రజ్యోతి): ప్రజాసంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. కుటుంబ సాధికార సభ్యులు (కేఎస్‌ఎస్) కూటమి ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధిని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో సోమవారం కెఎస్‌ఎస్ సభ్యుల తో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ఏడాది లో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్టు చెప్పారు. కూటమి ప్రభుత్వంలో కుటుంబంలో ఎంత మంది ఉన్నా అందరికి తల్లికి వందనం ఇచ్చామన్నారు. ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నట్టు చెప్పారు. గత ఐదేళ్లు విధ్వంసపాలన సాగించిన జగన్ మోహన్‌రెడ్డి కూటమి ప్రభుత్వంపై లేనిపోని దుష్ప్ర చారాలు రేపుతున్నారన్నారు. ఆయనను అధికారం కో ల్పోయేలా చేసిన ప్రజలను ఇబ్బందులకు గురిచేసేందు కు పన్నాగం పన్నారన్నారు. ప్రతి చోట ఏదొక రూ పంలో అలజడులు, కుల మతాల మధ్య చిచ్చులను సృ ష్టించి రాష్ట్రంలో భయోత్పాతాన్ని సృష్టించేందుకు పూను కున్నారని ఆరోపించారు. అసెంబ్లీకి రాకుండా ఇంట్లో నిద్రపోతున్నారని ఎద్దేవా చేశారు. బ్లాక్‌బర్లీ పొగాకును కొనుగోలు చేసిన రాష్ట్రం దేశంలో ఎక్కడైనా ఉంది అంటే అది మన రా ష్ట్రమేనని చెప్పారు. కనిగిరిలో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్‌ల ఏర్పాటుకు మంత్రి లోకేష్ చర్యలు తీసుకున్నారన్నారు. త్వరలో ప్లాంట్ ల నిర్మాణం ప్రారంభం కాబోతున్నా యన్నారు. ఏడాది కాలంలోనే రా ష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసిన కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో విరివిగా ప్రచారం చేయా ల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. పార్టీలో కేఎస్‌ఎస్ సభ్యులకు సముచిత స్థానం ఉంటుందన్నారు. ఇకనుం చి గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు కేఎస్‌ఎస్ ల పాత్ర పార్టీలో కీలకం కానుందన్నారు. సమావేశంలో నాయకులు నంబుల వెంకటేశ్వర్లు, సానికొమ్ము తిరుపతిరెడ్డి (ఎస్టీఆర్), వేమూరి రామ య్య, పువ్వాడి వెంకటేశ్వర్లు, తమ్మినేని శ్రీనివాసులురెడ్డి, ఫిరోజ్, భేరి పుల్లారెడ్డి, తమ్మినేని వెంకటరెడ్డి, అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.