ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Jul 04 , 2025 | 11:15 PM
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ అన్నారు. మండలంలో తంగిరాలపల్లి పంచాయతీలోని తమ్మడపల్లిలో రైతు సేవా కేంద్రాన్ని శుక్రవారం ఆ యన ప్రారంభించారు.

ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ బాలాజీ
పెద్దారవీడు, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ అన్నారు. మండలంలో తంగిరాలపల్లి పంచాయతీలోని తమ్మడపల్లిలో రైతు సేవా కేంద్రాన్ని శుక్రవారం ఆ యన ప్రారంభించారు. అనంతరం తంగిరాలపల్లిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ వై.పాలెం నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూ రి ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ ఇంటింటికీ తిరిగి తొలి ఏడాది ప్రజా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలకు సంబంధించిన కరపత్రాలను పం పిణీ చేశారు. ఈ సందర్భంగా ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పింఛన్ల పంపిణీ, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికివందనం పథకాలను అమలు చేశారన్నారు. నియోజకవర్గంలో తాగునీరు, పారిశుధ్య సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో దోచుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేసిందన్నారు. నాడు గ్రామాలకు వెళ్లాలంటే నరకయాతన పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం సుఖంగా వెళ్లే పరిస్థితికి ప్రజా ప్రభుత్వం తీసుకువస్తుందన్నారు. గ్రామీణ రోడ్ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతను ఇచ్చారన్నారు. కార్యక్రమంలో ఏవో ఎన్.లక్ష్మీనారాయణ, టీడీపీ మండల అధ్యక్షుడు మెట్టు శ్రీనివాసులరెడ్డి, మాజీ అధ్యక్షుడు గొట్టం శ్రీనివాసులరెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రగుంట్ల నాగేశ్వరరావు, నాయకులు శ్రీనివాసుల రెడ్డి, వెన్నా కోటిరెడ్డి, వెంకటరెడ్డి, ఇండ్లా రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.