ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు
ABN , Publish Date - Jul 09 , 2025 | 10:06 PM
గత వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీసిందని, ప్రజా ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు లాంటివని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 4వ వార్డులో శ్రేణులతో కలిసి ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాల పాంప్లెట్లు పం పిణీ చేశారు.
ఎమ్మెల్యే కందుల
మార్కాపురం, జూలై 9 (ఆంధ్రజ్యోతి) : గత వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీసిందని, ప్రజా ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు లాంటివని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 4వ వార్డులో శ్రేణులతో కలిసి ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాల పాంప్లెట్లు పం పిణీ చేశారు. సీఎం చంద్రబాబు తొలి ఏడాదిలోనే ఇచ్చిన హామీలకు కట్టుబడి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం అమలు చేశారని, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, అలాగే అన్న క్యాంటీను,్ల పెన్షన్ల పెంపు, డీఎస్సీ నోటిఫికేషన్ వంటివి అమలు చేశారన్నారు. సంవత్సర కాలంలోనే రాష్ట్రానికి బహుళజాతి కంపెనీలను తీసుకువచ్చి వేల సంఖ్యలో ఉద్యోగ కల్పన చేశారన్నారు. గత వైసీపీ పాలకులు పూర్తికాని వెలుగొండ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేసి ప్రజలను మోసగించారన్నారు. వెలిగొండ పూర్తి, మార్కాపురం జిల్లా ఏర్పాటు చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. వైసీపీ తప్పుడు ప్రచారాన్ని శ్రేణులు తిప్పికొట్టాలని కందుల పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆయా బూత్, యూనిట్, క్లస్టర్ ఇన్‌చార్జ్‌లు పాల్గొన్నారు.
మంచి ప్రభుత్వానికి మద్దతుగా నిలవండి : ఎరిక్షన్‌బాబు
త్రిపురాంతకం : చెప్పిన హామీలు నెలరవేరుస్తూ ప్రజా సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పాటుపడుతుందని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. బుధవారం మండలంలోని సంఘం తాండాలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలకు తగ్గట్టుగా పనిచేసే ఇటువంటి మంచి ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా నిలవాలన్నారు. ఎన్ని సంక్షోభా లు ఉన్నా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలు నెరవేరుస్తున్న సంగతిని గుర్తుచేసుకోవాలన్నారు. పింఛన్‌ల పంపిణీలో గతంలో ఎన్నడూ చేయని విధంగా సెలవు వస్తే 1వ తేదీకి ముందురోజే ఇస్తున్నారన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యంగా త్రిపురాంతకంం మండలంలో పలు పనుల కోసం తాను పలు ప్రతిపాదనలు చేశానని వాటన్నిటికి సీఎం సానుకూలంగా ఉన్నారని త్వరలోనే నిధులు రాబట్టి అభివృద్ధి ద్ది పనులు పూర్తి చేస్తామన్నారు. అనంతరం ఆయన ఇంటింటికీ తిరిగి కరపత్రాలను పంచిపెట్టారు. అనంతరం ఎరిక్షన్‌బాబును గ్రామస్థులు సన్మానించారు.