Share News

ప్రజానేతలను ఆదర్శంగా తీసుకోవాలి

ABN , Publish Date - Dec 14 , 2025 | 10:33 PM

చిరస్మర ణీయులైన మహనాయకుల విగ్రహాలను ఆవి ష్కరించటం అదృష్టంగా భావిస్తున్నామని రం గా మిత్రమండలి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ, టీడీపీ నియోజకవర్గ ఇన్‌ చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు. దర్శి పట్టణంలోని అద్దంకి రోడ్డులో కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీకృష్ణదేవరాయులు, వంగవీటి మోహనరంగా, కనకం వెంకయ్య విగ్రహాలను ఆదివారం ఆవిష్కరించారు.

ప్రజానేతలను ఆదర్శంగా తీసుకోవాలి
శ్రీకృష్ణదేవరాయులు, వంగవీటి రంగా, కనకం వెంకయ్య విగ్రహాలను ఆవిష్క రించిన వంగవీటి రాధ, డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి, పాపారావు తదితరులు

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి

దర్శి, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): చిరస్మర ణీయులైన మహనాయకుల విగ్రహాలను ఆవి ష్కరించటం అదృష్టంగా భావిస్తున్నామని రం గా మిత్రమండలి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ, టీడీపీ నియోజకవర్గ ఇన్‌ చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు. దర్శి పట్టణంలోని అద్దంకి రోడ్డులో కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీకృష్ణదేవరాయులు, వంగవీటి మోహనరంగా, కనకం వెంకయ్య విగ్రహాలను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద, బడుగు, బల హీన వర్గాల అభ్యున్నతి కోసం చివరి శ్వాసవరకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి రంగా అని కొని యాడారు. రాజధర్మాన్ని పాటించి ప్రజల్లో సుస్థిరస్థానం పొందిన మహనీయుడు శ్రీకృష్ణదే వరాయులు అని కొనియాడారు. పాలన ఎలా చేయాలో శ్రీకృష్ణదేవరా యులు రోల్‌మోడల్‌గా నిలిచారని చెప్పారు. దర్శి అభి వృద్ధికి పునాధులు వేసిన గొప్ప నాయకుడు కనకం వెం కయ్య అని ప్రశంసించారు. దర్శి మేజర్‌ పంచాయితీ సర్పంచ్‌గా 25 సంవత్సరాలు ఏకధాటిగా పదవిని అలంకరించిన మహనీయు డని కొని యాడారు. యువత ఆ ముగ్గురి నాయకు లను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సా గాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపు శెట్టి పాపారావు, టీడీపీ నియోజకవర్గ నాయకుడు డాక్టర్‌ కడియాల లలిత్‌సాగర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, ఏఎంసీ చైర్మన్‌ దారం నాగవేణి, సుబ్బా రావు, మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బయ్య, జిల్లా కాపు సంఘం నాయకులు మద్దిశెట్టి శ్రీధర్‌, వరికూటి నాగరాజు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పుల్లలచెరువు చిన్నా, మాజీ అధ్యక్షుడు యాదగిరి వాసు, కౌన్సిలర్‌ కన కం శ్రీనివాసరావు, స్థానిక కాపు సంఘం నాయకులు నూగుల కోటి, వేళ్ల కోటి, ఊరిబిండి మధు, జనసేన నాయకులు కుప్పాల పాపారావు, చిరంజీవి, బ్రహ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 14 , 2025 | 10:33 PM