Share News

ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

ABN , Publish Date - May 05 , 2025 | 10:43 PM

రెవెన్యూ అధికారులు ప్రజలను కార్యాలయం చుట్టూ తిప్పు కోకుండా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి సూచించారు.

ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
వృద్ధుడు ఇచ్చిన అర్జీని పరిశీలిస్తున్న మంత్రి స్వామి

రెవెన్యూ అధికారులకు మంత్రి స్వామి ఆదేశం

పొన్నలూరు, మే 5 (ఆంధ్రజ్యోతి) : రెవెన్యూ అధికారులు ప్రజలను కార్యాలయం చుట్టూ తిప్పు కోకుండా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి సూచించారు. స్థానిక మండల తహసీల్దార్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన రెవెన్యూ సమస్యల పరిష్కార వేదికలో ఆయన పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలు సుకున్నారు. ఈసందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కార మా ర్గాలను తెలియజేయాలని రెవెన్యూ అధికారులకు సూచిం చారు. మండలంలోని అన్ని గ్రా మాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి వివిధ సమస్యలపై అర్జీలను అందజే శారు. సాంఘిక సంక్షేమశాఖ డీడీ లక్ష్మానాయక్‌, కనిగిరి ఆర్డీవో కేశవర్ధన్‌రెడ్డి, మైనారిటీ వెల్ఫేర్‌ అధికారి పార్థసారథి, తహసీల్దార్‌ పుల్లారావు, ఎంపీడీవో సుజాత, వీఆర్వోలు పాల్గొన్నారు.

Updated Date - May 05 , 2025 | 10:43 PM