ప్రజాదర్బార్‌తో ప్రజాసమస్యలు పరిష్కారం
ABN , Publish Date - Dec 19 , 2025 | 11:36 PM
ప్రజాసమస్యలను ప్రజాదర్బార్‌లో తెలుసుకుని త్వరగా పరిష్కరించవచ్చని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి చెప్పారు.
ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి
గిద్దలూరు టౌన్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : ప్రజాసమస్యలను ప్రజాదర్బార్‌లో తెలుసుకుని త్వరగా పరిష్కరించవచ్చని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత శాఖల అధికారులకు వాటి పరిష్కారానికి సూచనలిస్తూ ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకి అర్జీ రూపంలో అందచేశారు. ప్రధానంగా నివాస స్థలాలు, పక్కాగృహాలు, దివ్యాంగ, సామాజిక పింఛన్లు, పొలాలకు విద్యుత్ సమస్యలతోపాటు గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై అర్జీలు అందాయి. ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి సమస్య ఉన్నా ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజాదర్బార్‌లో తనకు తెలియచేయాలని, తద్వారా పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.