Share News

ప్రజారోగ్యంపై శ్రద్ధ వహించాలి

ABN , Publish Date - May 01 , 2025 | 11:28 PM

ప్రజారోగ్యం పట్ల మున్సిపల్‌ పారిశుధ్య విభాగం ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎ మ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక కంభం రోడ్డులోని అటవీశాఖ కార్యాలయం ముందు ప్రధాన మురుగు కాలువలో డీసిల్టింగ్‌ పనులను ఎమ్మెల్యే కందుల ప్రారంభించారు.

ప్రజారోగ్యంపై శ్రద్ధ వహించాలి

పారిశుధ్య సిబ్బందికి

ఎమ్మెల్యే కందుల సూచన

మార్కాపురం, మే 1 (ఆంధ్రజ్యోతి) : ప్రజారోగ్యం పట్ల మున్సిపల్‌ పారిశుధ్య విభాగం ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎ మ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక కంభం రోడ్డులోని అటవీశాఖ కార్యాలయం ముందు ప్రధాన మురుగు కాలువలో డీసిల్టింగ్‌ పనులను ఎమ్మెల్యే కందుల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం జూలైలో మార్కాపురం మున్సిపాలిటీకి బీపీఎస్‌ కింద మంజూరైన రూ.53లక్షల నిధులతో పట్టణంలోని డ్రైన్లు అన్నింటినీ శుభ్రం చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఒకదఫా శుభ్రం చేశారన్నారు. ఈ నెల 15వ తేదీలోగా రూ.20 లక్షలతో డీసిల్టింగ్‌ పనులు పూర్తవుతాయన్నారు. మున్సిపల్‌ కౌన్సిలర్లు ఎక్కడికక్కడ వారి వార్డుల పరిధిలో పనులను దగ్గరుండి పర్యవేక్షించాలన్నారు. ఎక్కడైనా లోపాలుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ డీవీఎస్‌ నారాయణరావు, ఏఈ భూపాల్‌రెడ్డి, టీడీపీ నాయకులు షేక్‌ మౌళాలి, మాలపాటి వెంకటరెడ్డి, కౌన్సిలర్‌ నాలి కొండయ్య, దారివేముల హర్షితబాబీ, చిలకపాటి భవాని లింగమయ్య, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 01 , 2025 | 11:28 PM