Share News

రైతులకు ప్రజా ప్రభుత్వం అండ

ABN , Publish Date - Nov 26 , 2025 | 11:49 PM

రైతన్నలకు ప్రజా ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పెద్ద నాగులవరం గ్రామంలో బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన రైతన్నా మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

రైతులకు ప్రజా ప్రభుత్వం అండ
పెద్దనాగులవరంలో రైతన్నా మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల

ఎమ్మెల్యే కందుల

మార్కాపురం రూరల్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి) : రైతన్నలకు ప్రజా ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పెద్ద నాగులవరం గ్రామంలో బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన రైతన్నా మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందుల మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి దాని ద్వారా ఈ ప్రాంతంలో తాగు, సాగుకు నీరు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రైతన్నలు ప్రస్తుత సమాజంలో జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాగులు, సజ్జలు, జొన్నలు వంటి చిరుదాన్యాలను సాగు చేసుకోవాలని తెలిపారు. సాగుకు అనుగుణంగా నూతన టెక్నాలజీని ఉపయోగించి మంచి ఫలితాలు సాధించాలని కోరారు. వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సేవలను వినియోగించుకుని పంటలలో అధిక దిగుబడులు సాధించాలని కోరారు. కార్యక్రమంలో హెచ్‌ఓ రమేష్‌, ఏవో బుజ్జిబాయి, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ వెంకటరెడ్డి, గ్రామ టీడీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

ఇచ్చిన ప్రతి మాటా

నెరవేర్చుతున్న సీఎం

టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు

ఎర్రగొండపాలెం రూరల్‌ : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు - చెప్పిన మాటలన్నింటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు నూటికినూరు శాతం అమలు చేస్తున్నారని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. బుధవారం మండలంలోని గంజివారిపల్లి గ్రామంలో వ్యవసాయ, ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం కంపెనీల ఏర్పాటు, నిరుద్యోగ యువత కోసం ఉద్యోగాలు, మహిళల కోసం గ్యాస్‌, ఉచిత బస్సు, ప్రయాణికుల సౌకర్యార్థం రోడ్లు, రైతుల కోసం అన్నదాత సుఖీభవ, పేదల కోసం అనేక పథకాలతో ప్రజా ప్రభుత్వం దూసుకుపోతోందని అన్నారు. రాష్ట్ర ప్రగతిని, ఆర్థిక వ్యవస్థను జగన్‌రెడ్డి చిన్నాభిన్నం చేశారన్నారు. ప్రజా ప్రభుత్వం దానిని గాడిలో పెడుతూనే ప్రజలు, రైతుల కష్టాలను తీర్చతున్నదన్నారు. తాజాగా మార్కాపురం జిల్లాకు ఆమోదముద్ర పడడం పశ్చిమ ప్రాంత ప్రజలకు వరమన్నారు. అలాగే వెలిగొండను త్వరితగతిన పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నిమ్మల కృషి చేస్తున్నారన్నారు. అటు జిల్లా, ఇటు వెలిగొండ పూర్తితో పశ్చిమ ప్రాంత ప్రజల కష్టాలు తీరుతాయని ఎరిక్షన్‌బాబు ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలపాలన్నారు. రైతులతో మాటామంతి నిర్వహిస్తున్న సమయంలో కొంత మంది స్పందిస్తూ గతంలో టీడీపీ హయాంలో సబ్సిడీపై ఇచ్చిన వ్యవసాయ పరికరాలను ఇప్పుడు కూడా ఇవ్వాలని కోరారు. ప్రభుత్వంతో మాట్లాడి వాటి మంజూరుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు చైర్మన్‌ చేకూరి సుబ్బారావు, మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాళ వెంగళరెడ్డి, ఏవో నీరజ, మహేష్‌ నాయుడు, ఎంసీహెచ్‌ మంత్రునాయక్‌, సత్యనారాయణ గౌడ్‌, చెవుల అంజయ్య, మస్తాన్‌ వలీ, పేరం రమణా రెడ్డి, వ్యవసాయా, ఉద్యాన, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Nov 26 , 2025 | 11:49 PM