Share News

సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్‌

ABN , Publish Date - Dec 27 , 2025 | 11:33 PM

ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌ బాబు అన్నారు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు వారానికోసారి ప్రజా దర్బార్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్‌
ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరిస్తున్న ఎరిక్షన్‌బాబు

టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు

ఎర్రగొండపాలెం రూరల్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌ బాబు అన్నారు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు వారానికోసారి ప్రజా దర్బార్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు నేరుగా సమస్యను చెప్పుకునే అవకాశంతోపాటు ప్రాధాన్యత ఉన్న వాటికి తక్షణమే పరిష్కార చర్య లు కూడా తీసుకుంటున్నామని ఎరిక్షన్‌బాబు తెలిపారు. దీంతో ప్రజాదర్బార్‌కు విశేష స్పందన లభిస్తోందన్నారు. శనివారం ప్రజా దర్బార్‌లో ప్రజల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో మార్కెట్‌ యార్డు చైర్మన్‌ చేకూరి సుబ్బారావు, పార్టీ మండల అధ్యక్షుడు చిట్యాల వెంగళరెడ్డి, కంచర్ల సత్యనారాయణ, ఎంసీహెచ్‌ మంత్రునాయక్‌, వేగినాటి శ్రీను పాల్గొన్నారు

సీఎం చిత్రపటానికి పాస్టర్ల పాలాభిషేకం

ఎర్రగొండపాలెం రూరల్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : క్రిస్మస్‌ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని పాస్టర్లకు 12 నెలల వేతనాలను ఒకే సారి విడుదల చేయడంపై శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాస్టర్లు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ పెద్ద ఎత్తున వేతనాలు విడుదల చేయడం పాస్టర్ల ఇళ్లల్లో పండుగ అని పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని వెల్ఫేర్‌ సొసైటీ పాస్టర్‌ యూనియన్‌ అధ్వర్యంలో కృతజ్ఞతా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం కేక కట్‌ చేసి ప్రజా ప్రభుత్వానికి కృతజ్జతలు తెలియజేశారు. కార్యక్రమంలో నియోకవర్గ పాస్టర్ల యూనియన్‌ అధ్యక్షుడు లక్ష్మయ్య, మం డల అధ్యక్షుడు అబ్రహం, దేవయ్య, యోహాను, సామ్యూల్‌, పాలంకయ్య, మరేబాబు, భూషణం, మోసేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2025 | 11:33 PM