రైతులకు సబ్సిడీపై డ్రోన్‌ల అందజేత
ABN , Publish Date - Jun 03 , 2025 | 10:44 PM
రైతులకు సబ్సిడీతో వ్యవసాయ పరికరాలు ఇచ్చి వారికి ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు.
త్రిపురాంతకం, జూన్ 3 (ఆంధ్రజ్యోతి) : రైతులకు సబ్సిడీతో వ్యవసాయ పరికరాలు ఇచ్చి వారికి ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. మంగళవారం త్రిపురాంతకం మండలం మేడపిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని వ్యవసాయశాఖ ద్వారా మంజూరైన డ్రోన్ పరికరాన్ని రైతులకు అందజేశారు. ఇప్పటివరకు రూ.27లక్షల విలువైన పరికరాలను సబ్బిడీపై ఇక్కడి రైతులకు ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత అందజేయడం జరిగిందన్నారు. రైతులు వాటిని వినియోగించుకోవాలని ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కలిగి ఉండాలని కోరారు.