విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
ABN , Publish Date - Nov 04 , 2025 | 11:16 PM
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. మండలంలోని ఎగువచెర్లోపల్లి వద్ద ఉన్న మోడల్ స్కూల్‌ను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు
పెద్ద దోర్నాల, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. మండలంలోని ఎగువచెర్లోపల్లి వద్ద ఉన్న మోడల్ స్కూల్‌ను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠ శాలలోని వసతులు, వంటగదిని పరిశీలించిన ఎరిక్షన్‌బాబు విద్యార్థులతో మాట్లాడారు. నీటి సమస్య ఉన్నట్లు విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా త్వరలో పరిష్కరించనునట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి అనేక పథకాలను అమలు చేస్తోందని, వినియోగించుకొని ఉన్నతంగా ఎదగాలని ఎరిక్షన్‌బాబు సూచించారు. భోజనాన్ని రుచిగా, సుచిగా ఒండి అందించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈవో మస్తాన్ నాయక్, ప్రిన్సిపాల్ ఆంజనేయులు, టీడీపీ మండల అధ్యక్షుడు షేక్‌మాబు, సొసైటీ అధ్యక్షుడు బట్టు సుధాకర్‌రెడ్డి, ఎలకపాటి చెంచయ్య, రాఘవ, చంటి, రమణారెడ్డి పాల్గొన్నారు.