విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
ABN , Publish Date - Mar 12 , 2025 | 12:12 AM
విద్యార్థులకు శుచి, శుభ్రతతోపాటు నాణ్యమైన భోజనం అందించాలని ఏపీ బాలల హక్కుల పరిరక్షన కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి ఆదేశించారు. మంగళవారం పర్చూరులోని గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని ఆమె తనిఖీ చేశారు. వసతి గృహంలో చీమలు పట్టిన ఆహార పదార్థాలను ఆమె గుర్తించి ఇలాంటివి మీ పిల్లలకు పెడతారా అని ప్రిన్సిపాల్ శ్రీనునాయక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడునెలలుగా ఈ వసతిగృహంపై ఫిర్యాదులు అందుతున్నట్లు చెప్పారు.

బాలల హక్కుల పరిరక్షన కమిషన్ సభ్యురాలు పద్మావతి
పర్చూరు, మార్చి 12 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులకు శుచి, శుభ్రతతోపాటు నాణ్యమైన భోజనం అందించాలని ఏపీ బాలల హక్కుల పరిరక్షన కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి ఆదేశించారు. మంగళవారం పర్చూరులోని గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని ఆమె తనిఖీ చేశారు. వసతి గృహంలో చీమలు పట్టిన ఆహార పదార్థాలను ఆమె గుర్తించి ఇలాంటివి మీ పిల్లలకు పెడతారా అని ప్రిన్సిపాల్ శ్రీనునాయక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడునెలలుగా ఈ వసతిగృహంపై ఫిర్యాదులు అందుతున్నట్లు చెప్పారు. విద్యార్థులు అనుగుణంగా వసతి గృహం లేదని, చాలీచాలని వసతులతో ఇబ్బంది పడుతున్నట్లు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థులను ఉపాధ్యాయులు దండిస్తున్నట్లు అందిన ఫిర్యాదుమేరకు సంబంధిత ఉపాధ్యాయులను ప్రశ్నించారు. బాధ్యులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ప్రిన్సిపాల్‌ను ఆమె ఆదేశించారు. ఇలాంటి చర్యలు పునరావృతం అయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులకు స్వయంగా ఆమె భోజనం వడ్డించారు. కార్యక్రమంలో తహసీల్దార్ పి.బ్రహ్మయ్య, ఎంఈవో పి.వెంకట్రామయ్య, సీడీపీవో సుభద్ర, ఏఎస్సై సురేష్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మస్తాన్‌రావు, వీఆర్వోలు యార్లగడ్డ శ్రీనివాసరావు, గోవిందరెడ్డి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే చీరాలలోని ఓ ప్రైవేటు స్కూల్‌ను కమిషన్ సభ్యురాలు పద్మావతి తనిఖీ చేశారు. హాల్‌టికెట్లు ఇవ్వడంలేదని అంది న ఫిర్యాదుపై ఆమె స్పందిస్తూ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పునరావృతం కావద్దని తెలిపారు. సమస్యలేమైనా ఉంటే టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయాలని విద్యార్థులకు ఆమె సూచించారు.