Share News

రోగులకు మెరుగైన సేవలందించాలి

ABN , Publish Date - May 15 , 2025 | 11:24 PM

రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. గురువారం గిద్దలూ రు ఏరియా ఆసుపత్రి మీటింగ్‌ హాల్చులో 6 మండలాల వైద్యశాఖ అధికారులతో స మీక్ష సమావేశం నిర్వహించారు.

రోగులకు మెరుగైన సేవలందించాలి
వైద్యాధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

ఆసుపత్రి అభివృద్ధి కమిటీ

సమావేశంలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

గిద్దలూరు టౌన్‌, మే 15 (ఆంధ్రజ్యోతి): రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. గురువారం గిద్దలూ రు ఏరియా ఆసుపత్రి మీటింగ్‌ హాల్చులో 6 మండలాల వైద్యశాఖ అధికారులతో స మీక్ష సమావేశం నిర్వహించారు. తొలుత ఓపీ గదిని, ప్రైమరీ ఔషధాలయం, ఆర్‌వో మినరల్‌ వాటర్‌ ప్లాంటును ఎమ్మె ల్యే అశోక్‌రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు రోగులు ఎంతమేరకు వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. సి బ్బంది కొరత, వైద్యుల కొరత అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ గ్రామీణ ప్రాంతాలలో మెడికల్‌ క్యాంపు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిని గత పాలకులు మరచి 100 పడకలుగా ఉన్న ఆసుపత్రిని 40 పడకలకు మార్చడం శోచనీయమన్నారు. ప్రస్తుతం 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఆసుపత్రి ఆవరణలో అభివృద్ది పనులు వేగంగా జరుగుతున్నాయని, కాంపౌండ్‌ వాల్‌, సి మెంట్‌ రోడ్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగిందన్నారు. 108, 104 సర్వీసులు ప్ర జలకు ఏవిధంగా సర్వీసు అందిస్తున్నా యో రికార్డులను తనిఖీ చేశారు. నియోజకవర్గంలో 24 గంటలపాటు తెరచి ఉండే ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు కచ్చితంగా ఉండాలని ఆదేశించారు. సమావేశంలో నగర పంచాయతీ చైర్మన్‌ పా ముల వెంకటసుబ్బయ్య, కమిషనర్‌ ఐ.శ్రీనివాసులు, 6 మండలాల వైద్య అధికారులు, ముఖ్యనాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2025 | 11:25 PM