తాగునీటి కోసం రాస్తారోకో
ABN , Publish Date - Mar 11 , 2025 | 01:37 AM
పది రోజులుగా తాగునీరు లేకపోవడంతో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. గుంటూరు-కర్నూలు రహదారిపై సోమవారం నిరసనకు దిగారు. ప్రభుత్వాలు మారినా తమ కష్టాలు తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన పోతంపల్లి మహిళలు
పెద్దారవీడు, మార్చి 10 (ఆంధ్రజ్యోతి) : పది రోజులుగా తాగునీరు లేకపోవడంతో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. గుంటూరు-కర్నూలు రహదారిపై సోమవారం నిరసనకు దిగారు. ప్రభుత్వాలు మారినా తమ కష్టాలు తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. మండలంలోని పోతంపల్లి ఎస్సీ కాలనీకి పది రోజుల నుంచి నీటి సరఫరా జరగడం లేదు. గ్రామమంతా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితులను ముందే తెలుసుకున్న అధికారులు కొంత మేరకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. కానీ ఆ నీరు సరిపోవడం లేదంటూ ఎస్సీ కాలనీ మహిళలు రాస్తారోకో చేశారు. సరిపడినన్ని సరఫరా చేయాలని నినదించారు. విషయం తెలుసుకున్న ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు పోతంపల్లి చేసుకొని ఉన్నతాధికారుల అనుమతితో ట్యాంకర్లను పెంచి నీటిని సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.