Share News

ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యం

ABN , Publish Date - Aug 18 , 2025 | 10:48 PM

ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రజాప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గంలోని 85మంది లబ్ధిదారులకు రూ.50లక్షల 42వేల 669 చెక్కులను పంపిణీ చేశారు.

ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యం
లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేస్తున్న డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి

దర్శి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రజాప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గంలోని 85మంది లబ్ధిదారులకు రూ.50లక్షల 42వేల 669 చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదల అనారోగ్యానికి గురై సరైన వైద్యం చేయించకునే శక్తిలేక ఇబ్బందిపడుతున్న తరుణంలో సీఎం చంద్రబాబునాయుడు దయాగల హృదయంతో ఆర్థిక సహాయం అందజేస్తున్నారని చెప్పారు. దీంతో ప్రజలం దరికి ఆరోగ్య భరోసా కలుగు తుందన్నారు. కార్యక్రమంలో దర్శి, తాళ్ళూరు, ముండ్లమూ రు, దొనకొండ మండలాల టీడీపి అధ్యక్షులు మారెళ్ళ వెంకటేశ్వర్లు, మేడగం వెంక టేశ్వరరెడ్డి, కూరపాటి శ్రీని వాసరావు, మోడి ఆంజనే యులు, దర్శి పట్టణ అధ్య క్షుడు పుల్లలచెరువు చిన్నా, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 18 , 2025 | 10:48 PM