Share News

చెరువుల అభివృద్ధికి ప్రతిపాదనలు

ABN , Publish Date - May 11 , 2025 | 11:31 PM

ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మె ల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి చొరవతో నియోజకవర్గంలోని పలు చెరువులకు మహర్దశ పట్టింది. నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ నదులు ఏవీ లేకపోవడంతో వ్యవసాయానికి ఈ ప్రాంత రైతులు చెరువులు, కుంటలపైనే ఆధారపడాల్సి వస్తున్నది.

చెరువుల అభివృద్ధికి ప్రతిపాదనలు
తక్కువ ఎత్తులో ఉన్న దొనకొండ ఆనకట్ట

ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

చొరవతో మహర్దశ

కంభం, మే 11 (ఆంధ్రజ్యోతి) : ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మె ల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి చొరవతో నియోజకవర్గంలోని పలు చెరువులకు మహర్దశ పట్టింది. నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ నదులు ఏవీ లేకపోవడంతో వ్యవసాయానికి ఈ ప్రాంత రైతులు చెరువులు, కుంటలపైనే ఆధారపడాల్సి వస్తున్నది. చెరువుల్లో నీరు ఉంటేనే భూ గర్భజల మట్టం పెరిగి బోర్లలో నీరు చేరి సాగు, తాగుకు నీరు వస్తుంది. కేవలం వర్షాధారంపైనే ఆధారపడి జీవిస్తున్న పశ్చిమ ప్రాంత ప్రజలు, రైతులకు అవసరమైన నీటి వనరులపై గత వైసీపీ పాలకులు తీవ్ర నిర్లక్ష్యం చూపారు. చెరువుల అభివృద్ధికి అరకొర నిధులు ఇవ్వడంతో పనులన్నీ పడకేశాయి. నియోజకవర్గంలోని చెరువులకు చిన్న చిన్న మరమ్మతులు సకాలంలో చేయకపోవడంతో ఏటా కురిసే వర్షం నీరు వృథాగా పోతుంది. దీంతో ఆయకట్టు సాగు రైతులకు నీరందక అవస్థలు పడుతున్నారు. తెలుగుదే శం ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి చెరువుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడమే కాకుండా ప్రతిపాదనలు తయా రు చేశారు. దీంతో వేసవికాలంలో చెరువులు బాగు చేసేందుకు ఇరిగేషన్‌ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. నీటి పారుదలశాఖ అధికారులు ఇటీవల చేయాల్సిన పనుల అంచనాలతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పం పారు. అర్ధవీడు మండలంలోని కాకర్ల చెరు వు, దొనకొండ తులారాం కతువలకు రూ.2.84 కోట్లతో కట్టల అభివృద్ధితో పాటు ప్రస్తుతం ఉన్న ఆనకట్టల ఎత్తు పెంచేందుకు ప్రతిపాదనలు పంపారు. కంభం మండలంలోని యర్రబాలెం ఆనకట్టతోపాటు కాలువల మరమ్మతులకు, కంభం చెరువు కాలువల బాగుకు రూ.1.65 కోట్ల నిధులు అవసరమని ప్రతిపాదించారు. బేస్తవారపేట మండలంలోని మల్లాపురం, మోక్షగుండం కొత్త చెరువు మరమ్మతులకు రూ.2 కోట్లు అవసరం కాగా, 3 మండలాల పరిధిలో సుమారు రూ.6 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. దీనితోపాటు గతం లో అభివృద్ధి పనులు మంజూరైన పూసలపా డు, తురిమెళ్ల, బొల్లుపల్లి నాయిని, తిమ్మన్న చెరువుల పనులకు కేటాయించిన నిధులను గత వైసీపీ పాలనలో దారి మళ్లించారు. అప్పటి కాంట్రాక్టర్లు అరకొర పనులు చేసి వదిలివేశారు. అసంపూర్తిగా నిలిచిపోయిన ఈ చెరువులకు కూడా నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.

పర్యాటక కేంద్రంగా కంభం చెరువు మార్పుపై ప్రత్యేక దృష్టి

ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద కంభం చెరువును పర్యాటక కేంద్రంగా చేయాలనే సంకల్పంతో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌తో మాట్లాడారు. చెరువు అభివృద్ధి పనులకు, పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రత్యేక నిధులను విడుదల చేయాలని కోరారు. దీంతో సీఎం, డిప్యూటీ సీఎం స్పందిం చారు. ఆ మేరకు ఇటీవల జిల్లా నుంచి పర్యాటక కేంద్ర ప్రత్యేక అధికారి శరణ్య కంభం చెరువును పరిశీలించారు. కంభం చెరువు అభివృద్ధితో నియోజకవర్గంలోని చెరువులకు మహర్దశ పట్టనుందని ఈప్రాంత రైతులు, ప్రజలు ఆనందనం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 11 , 2025 | 11:31 PM