ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
ABN , Publish Date - Apr 10 , 2025 | 12:01 AM
నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యతను ఇస్తున్నట్లు ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.

ఎమ్మెల్యే కొండయ్య
చీరాల, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి) : నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యతను ఇస్తున్నట్లు ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈసందర్భంగా నివేశన స్థలాలు - 80, పెన్షన్ - 45, రేషన్ కార్డులు - 25 అర్జీలు అందినట్లు చెప్పారు. ప్రాధాన్యతాక్రమంలో సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కొద్ది రోజుల్లో నియోజకవర్గంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఈడబ్ల్యూసీ ఆధ్వర్యంలో జరిగే ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, అర్జీదారులు పాల్గొన్నారు.