Share News

ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు

ABN , Publish Date - Sep 17 , 2025 | 11:18 PM

ప్రధాని నరేంద్రమోదీ జన్మదిన వేడుకలను బుధవారం ఘ నంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి కార్యక్రమంలో పాల్గొని బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన కేక్‌ను ఆయన కట్‌ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ రాజకీయాలపైనే కాకుండా ప్రజల మనోభావాలపై కూడా ముద్ర వేసిన మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు
మోదీ ఫొటోను ఎమ్మెల్యేకు అందజేస్తున్న నేతలు

గిద్దలూరు టౌన్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్రమోదీ జన్మదిన వేడుకలను బుధవారం ఘ నంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి కార్యక్రమంలో పాల్గొని బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన కేక్‌ను ఆయన కట్‌ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ రాజకీయాలపైనే కాకుండా ప్రజల మనోభావాలపై కూడా ముద్ర వేసిన మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మోర్చా కార్యవర్గ సభ్యుడు పిడతల రమే్‌షరెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బాదుల్లా, నాయకులు నరసింహులు, ఆంజనేయులు పాల్గొన్నారు.

గిద్దలూరు : ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను పట్టణంలోని పీఆర్‌కాలనీలోని సంజీవని అనాథ ఆశ్రమంలో బీజేపీ నాయకులు నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి పంచిపెట్టారు. వృద్ధులు, విద్యార్థులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జేవీ నారాయణ, నాయకులు బీవీ రామాంజనేయులు, గుమ్మా రాముడు, కె.వి.చంద్రమోహన్‌, మట్టెమల్లె పుల్లయ్య, కాసులు, రామక్రిష్ణ పాల్గొన్నారు. అనంతరం జీఎ్‌సటీని సవరించిన ప్రధాని చిత్రపటానికి నాయకులు పాలాభిషేకం చేశారు.

కంభం : మోదీ జన్మదిన వేడుకలను బీజేపీ నాయకులు బుధవారం ఘనంగా నిర్వహించారు. మెయిన్‌ బజార్‌లో కేక్‌ కటింగ్‌ అనంతరం కంభం, కందులాపురం పంచాయతీ కార్మికులకు దుప్పట్లు, స్వీట్లు, భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జేవీ నారాయణ, జిల్లా మాజీ ఇన్‌చార్జి పళ్లెం శ్రీనివాసులు, మండల పార్టీ అధ్యక్షుడు బాదం కిషోర్‌ కుమార్‌, జిల్లా కోశాధికారి బాదం మనోహర్‌, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఎర్రగొండపాలెం : అభివృద్ధిలో భారత్‌ను అగ్రభాగాన నిలబెట్టిన మార్గదర్శకు లు ప్రధాని మోదీ అని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. పార్టీ కార్యాలయంలో బుధవారం మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మ న్‌ చేకూరి సుబ్బారావు, సాగునీటి సం ఘం అధ్యక్షుడు దేవినేని చలమయ్య, వేగి నాటి శ్రీను, ఆళ్ల నాసరరెడ్డి, మల్లికార్జునరావు పాల్గొన్నారు.

పెద్ద దోర్నాల : శివసదనులో పీఎం మోదీ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. బీజేపీ మండల మాజీ అధ్యక్షుడు సురవరం గండి వీరారెడ్డి అధ్యక్షతన కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు బట్టు సుధాకర్‌రెడ్డి, టీడీపీ నాయకులు షేక్‌ మాబు, ఈదర మల్లయ్య, సుబ్బారెడ్డి, షేక్‌ మౌలాలి, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు కేతి మురళి పాల్గొన్నారు.

మార్కాపురం వన్‌టౌన్‌ : భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు వేడుకలు బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో పాతబస్టాండ్‌లోని గడియార స్తంభం వద్ద బీజేపీ నాయకులు కేక్‌ కట్‌ చేశారు. అనంతరం వృద్ధు లకు, దివ్యాంగులకు భోజనం ప్యాకెట్లు అందించారు. కార్యక్రమంలో బీజేపీ నా యకులు ఎస్‌.శ్రీనివాసులు, ఎస్‌.సరోజిని, పీవీ కృష్ణారావు, ఆంజనేయులు, సతీష్‌ కుమార్‌, డా. కిరణ్‌, షబానా పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2025 | 11:18 PM