Share News

ప్రధాని మోదీ సభకు తరలిరావాలి

ABN , Publish Date - Apr 28 , 2025 | 10:55 PM

అమరావతి లో మే 2న జరిగే ప్రధాని మోదీ బహిరంగ సభకు అధిక సంఖ్యలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి దర్శిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు.

ప్రధాని మోదీ సభకు తరలిరావాలి
కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న లక్ష్మి, పాల్గొన్న పాపారావు తదితరులు

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి పిలుపు

దర్శి, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): అమరావతి లో మే 2న జరిగే ప్రధాని మోదీ బహిరంగ సభకు అధిక సంఖ్యలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి దర్శిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. అమరావతి రాజధాని తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. రాజఽ దాని పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు వస్తు న్న ప్రధానికి ఘనంగా స్వాగతం పలకాలన్నారు. సమా వేశంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, తాళ్లూ రు ఎంపీపీ శ్రీనివాసరావు, దర్శి నగర పంచాయతీ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, తాళ్లూరు, ముండ్లమూరు, కురిచేడు, దొనకొండ మండలాల పార్టీ అధ్యక్షులు బి.ఓ బుల్‌రెడ్డి, శ్రీనివాసరావు, నెమలయ్య, ఎం.శివకోటేశ్వర రావు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నారాయణరెడ్డి, జనసే న మండల అధ్యక్షుడు పి.పాపారావు పాల్గొన్నారు.

స్వచ్ఛమైన మంచినీరు అందించటమే లక్ష్యం

దర్శి, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందిచటమే లక్ష్యంగా జలజీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికి కొళాయి పథకం నిర్మాణం చేపడుతున్నట్లు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు. మండలంలోని తానంచింతల, చలివేంద్ర, ఎర్రోబనపల్లి పంచాయతీల్లో సోమవారం సాయంత్రం ఇంటింటి కొళాయి పథకం నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ లక్ష్మి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం జలజీవన్‌ మిషన్‌ పథకం గురించి పట్టించుకోలేదన్నా రు. కొన్నిచోట్ల పనుల నిర్వహణలో అక్రమాలు జరిగాయన్నారు. అస్తవ్య స్తంగా మారిన ఈ పథకాన్ని కూట మి ప్రభుత్వం గాడిలో పెడుతుంద న్నారు. ఈపథకం పూర్తయితే నియో జకవర్గంలోని ప్రజలకు నిరంతరం స్వచ్ఛమైన మంచినీరు అందించే వీ లుకల్గుతుందన్నారు. నిర్మాణం పను లు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్ర మంలో నగర పంచాయతీ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, సానె సుబ్బయ్య, పుమిడిశెట్టి కోటయ్య, సందు రామయ్య, తదితరులు పాల్గొన్నారు.

ప్రధాని సభను విజయవంతం చేయాలి

కనిగిరి, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ సభను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలకులు గంగోడు నాగేశ్వరరావు అన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో సోమవారం టీ డీపీ నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మే2 అమరా వతిలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా మోదీ పాల్గొంటున్నట్టు చెప్పా రు. ఈసందర్భంగా భారీ బహిరంగ స భకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ప్రత్యేక ఏర్పాట్లుచేస్తున్న ట్లు తెలిపారు. ఈకార్యక్రమాన్ని విజయ వంతం చేసేందుకు కనిగిరి నియోజక వర్గం నుంచి టీడీపీ శ్రేణులు, కార్యకర్త లు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలిరా వాలన్నారు. శ్రేణులను, కార్యకర్తలను సమీకరించి తరలించే ఏర్పాట్లను నాయకులు చేయాలని సూచించారు. ప్రజల్ని చైతన్యపరచి ప్రతి గ్రామంలో టీడీపీ కార్యకర్తలు వారిని వెంట పెట్టుకుని సభకు తరలించే ఏర్పాట్లును వ్యక్తిగతంగా చేపట్టి విజయవంతానికి కృషి చేయాలన్నారు.

సమావేశంలో ఆరు మండలాలకు చెందిన పార్టీ అధ్యక్షులు, కనిగిరి మండల అధ్యక్షుడు నంబులు వెంక టేశ్వర్లు, పట్టణాధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసులురెడ్డి, పిచ్చాల శ్రీనివాసులురెడ్డి, నారపరెడ్డి శ్రీనివాసులురెడ్డి, వీవీఆర్‌ మనోహరరావు (చిరంజీవి), తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2025 | 10:55 PM